'కేజీఎఫ్‌ 2' కొత్త విడుదల తేదీకి వెళ్లక తప్పదా?

కన్నడ సూపర్ హిట్‌ మూవీ కేజీఎఫ్‌ కు సీక్వెల్‌ గా రూపొందిన కేజీఎఫ్‌ 2 విడుదలకు సిద్దం అయ్యింది.ఇప్పటికే షూటింగ్‌ ముగించుకున్న కేజీఎఫ్‌ 2 కు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.

 Yash And Prashanth Neel Kgf 2 Movie Release News 2-TeluguStop.com

ఈ సినిమా ను జులై 16, 2021 లో విడుదల చేయాలనుకున్నారు.ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల దేశ వ్యాప్తంగా కరోనా కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి.

దాంతో సినిమా థియేటర్లు స్వచ్చందంగా మూసి వేస్తున్నారు.దాంతో దాదాపు అన్ని సినిమా లు కూడా విడుదల ఆగిపోయాయి.

 Yash And Prashanth Neel Kgf 2 Movie Release News 2-కేజీఎఫ్‌ 2’ కొత్త విడుదల తేదీకి వెళ్లక తప్పదా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎట్టకేలకు మళ్లీ థియేటర్లు మొదలు అయినా కూడా జనాలు వస్తారా లేదా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతోంది.దేశ వ్యాప్తంగా కరోనా కేసుల్లో తగ్గుదల జూన్‌ లో కనిపించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అంటే జూన్‌ చివరి వరకు కరోనా కేసుల సంఖ్య పాతిక నుండి 30 వేలకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

అదే నిజం అయితే జులైలో పరిస్థితులు సాధారణంగా ఉండే అవకాశం ఉంది.

అంటే జులైలో సినిమా థియేటర్లు రన్‌ అవుతాయి.కాని కరోనా భయంతో జనాలు ఇంకా కూడా థియేటర్లకు రాకుంటే పరిస్థితి ఏంటీ అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అందుకే జులై 16న విడుదల అవ్వాల్సిన కేజీఎఫ్‌ 2 సినిమా ను వాయిదా వేసే అవకాశం ఉందని అంటున్నారు.వరుసగా పెద్ద సినిమా లు అన్ని కూడా వాయిదా పడుతున్న నేపథ్యంలో కేజీఎఫ్‌ 2 కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ విశ్లేషకులు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు నమోదు పై కన్నేసిన కేజీఎఫ్‌ 2 ను ఏమాత్రం ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా విడుదల చేయకూడదు అంటూ మేకర్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే దేశ వ్యాప్తంగా కరోనా పరిస్థితులు కుదుట పడ్డ తర్వాతే మళ్లీ థియేటర్లకు కేజీఎఫ్‌ 2 ను తీసుకు వెళ్లాలని భావిస్తున్నారట.

త్వరలోనే కేజీఎఫ్‌ 2 విడుదలకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

#KGF 2 #Kannada Film #Yash #Prashanth Neel #Kgf 2 Telugu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు