ఆదర్శం : కోడిగుడ్లతో ప్లాస్టిక్‌కు చెక్‌ పెట్టిన గ్రామం, ఎలాగో తెలుసా?

పట్టణాలు మరియు సిటీల్లో ప్లాస్టిక్‌ నిర్మూలనకు ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.ప్లాస్టిక్‌ వాడకం తగ్గించేందుకు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఏర్పాట్లు చేస్తున్నారు.

 Yarramballi Village People Band Plastic With Eggs-TeluguStop.com

ప్లాస్టిక్‌ వస్తువులను బ్యాన్‌ చేసినా కూడా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు.ప్లాస్టిక్‌ వినియోగంను వదిలేయడం లేదు.

తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం ప్రజలు ప్లాస్టిక్‌ ను వారంతట వారే వదిలేసేలా అధికారులు చేశారు.అక్కడి అధికారులు మరియు గ్రామ పంచాయితీ మెంబర్స్‌ పడుతున్న కష్టం దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.యాదాద్రి భువనగిరి జిల్లా యర్రంబెల్లి గ్రామ పంచాయితీ పరిధిలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదించారు.ప్రస్తుతం ఉన్న ప్లాస్టిక్‌ను కూడా పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే కేజీ ప్లాస్టిక్‌ తీసుకుని వచ్చిన వారికి ఆరు గుడ్లు ఇస్తామంటూ పంచాయితీ కార్యదర్శి ప్రకటించాడు.

దాంతో ఇంట్లో ఉన్న పనికిరాని ప్లాస్టిక్‌ అంతా కూడా గ్రామస్తులు వదిలేశారు.ముఖ్యంగా రీసైక్లిన్‌ కాని ప్లాస్టిక్‌ మొత్తం వెనక్కు వచ్చేసింది అంటూ అధికారులు ప్రకటించారు.

Telugu Yarramballi-General-Telugu

గుడ్లను ఆశగా చూపడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున ప్లాస్టిక్‌ను తీసుకు వచ్చారు.కొందరు గ్రామస్తులు ఆ కొడి గుడ్లను స్వీకరించేందుకు నిరాకరించారని, తమ గ్రామం బాగు కోసం అధికారులు చేస్తున్న పనికి తాము కూడా అండగా నిలుస్తామంటూ ప్లాస్టిక్‌ను ఇచ్చి గుడ్లు తీసుకోలేదు.ఇంకా గ్రామంలో పరిశుభ్రం మరియు పచ్చదనం కోసం గ్రామస్తులు చెట్లను నాటడం మరియు ఇతరత్ర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube