వైసీపీలో గన్నవరం మంటలు ! అసమ్మతి సెగ తప్పదా ?

ఇతర పార్టీల నుంచి వలసలు పెరగడం పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు దోహదం చేస్తుంది అనే విషయం అందరికి పైకి కనిపించే విషయమే అయినా, ఒక నియోజకవర్గ స్థాయి నేత పార్టీలోకి రావడం వల్ల ఆ నియోజకవర్గంలో అప్పటివరకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న నాయకులకు మాత్రం రుచించని విషయమే.కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకుడి కారణంగా తమ స్థానానికి ఎక్కడ చేటు వస్తుందో అన్న భయం వారిని భయపెడుతూనే ఉంటుంది.

 Yarlagadda Venkata Rao Opposes Vallabhaneni Vamsi Arrival Into Ysrcp-TeluguStop.com

అయితే ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇప్పుడు ఆ విధమైన పరిస్థితే ఎదురవుతోంది.కొత్తగా వచ్చిన, రాబోతున్న నాయకుల కారణంగా తమ స్థానానికి ఎక్కడ ముప్పు వస్తుందో అన్న ఆందోళన సదరు నాయకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

తాజాగా ఇదే రకమైన పరిస్థితి గన్నవరం నియోజకవర్గంలోనూ తలెత్తుతోంది.గన్నవరం టీడీపీ ఎమ్యెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో ఇప్పటి వరకు ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

వల్లభనేని వంశీ వైసీపీలో చేరడం దాదాపు ఖాయం అయిపొయింది.శుక్రవారం ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ కావడంతో ఆయన చేరిక పై ఒక క్లారిటీ వచ్చేసింది.

అయితే ఇప్పుడు వైసీపీలో కొత్త రచ్చ మొదలయ్యింది.వల్లభనేని వంశీ వైసీపీలో చేరడాన్ని ఆపార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు, నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.మరీ ముఖ్యంగా టీడీపీ నుంచి పోటీ చేసి వల్లభనేని గెలిచిన గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ నివాసానికి చేరుకున్నారు.ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారంటూ వస్తున్న వార్తలపై ఆయన రాకను నిరసిస్తూ పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు గన్నవరం వైసీపీ ఇన్‌చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు నివాసాని వెళ్లారు.

వంశీ వస్తే వైసీపీకి డ్యామేజ్ తప్పదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

Telugu Ys Jagan, Ysrcp-Telugu Political News

వల్లభనేని మాకు వద్దు యార్లగడ్డ ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అయితే దీనిపై ప్రస్తుతం తానేమి మాట్లాడానని ఈ విషయాన్ని తాను జగన్ వద్దే తేల్చుకుంటాను అంటూ యార్లగడ్డ కార్యకర్తలను సముదాయించారు.కొంతమంది వ్యక్తుల కుట్రలు, కుతంత్రాల కారణంగానే తాను గత ఎన్నికల్లో ఓటమి చెందానని, ఇప్పుడు వంశీ వస్తే తన పరిస్థితి ఏంటి అనే విషయం అర్ధం కావడంలేదని, తన రాజకీయ భవిష్యత్తు గురించి వంశీ పార్టీలో చేరిన తరువాత పరిస్థితులను బట్టి స్పందిస్తానని యార్లగడ్డ చెప్పుకొచ్చారు.

పైకి ఆ విధంగా చెబుతున్నా వంశీ చేరికను యార్లగడ్డ జీర్ణించుకోలేకపోతున్నట్టు అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube