నాగరికత పైత్యంతో తెలుగు అంతరిస్తోంది..యార్లగడ్డ

రాజ్య సభ మాజీ సభ్యులు, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నాట్స్ వేదికగా ప్రసంగించారు.తెలుగు బాష ఘోరమైన నిర్లక్ష్యానికి లోనవుతోందని.

 Yarlagadda Lakshmi Prasad At Nats Fest In America-TeluguStop.com

ఆవేదన వ్యక్తం చేశారు.అమెరికాలో నాట్స్ 6 వ తెలుగు సంబరాలలో పాల్గొన్న ఆయన తెలుగు పై నాగరిక పైత్యం ఎక్కువయ్యిందని అన్నారు.

తెలుగు వెలుగు కోసం తీవ్రంగా శ్రమించే యార్లగడ్డ చేసిన ఈ ప్రసంగం అందరిని ఆకట్టుకుంది.

నాగరికత పైత్యంతో తెలుగు అంతర

మమ్మీ డాడీ రెండు పదాలు కేవలం అమ్మా నాన్న కు ఉద్దేశించినవి కావడంతో వీటి వల్ల వచ్చే ప్రమాదం ఏమి లేదని కానీ అంకుల్-ఆంటీ అనే ఈ రెండు పదాలు మొత్తం సనాతన భారతీయ కుటుంభ సంప్రదాయాన్ని తుంగలో తొక్కేస్తున్నాయని అన్నారు.మావయ్య, బాబాయి, పెదనాన్న ఇలాంటి పదాలు అన్నిటికీ అంకుల్ అంటూ పిలుస్తున్నారు.ఆలాగే.

అత్త, పిన్ని, పెద్దమ్మ అనే పదాలకి ఆంటీ అంటున్నారు.ఈ ఒక్క పదంతోనే

తెలుగు నుదికారానికి ఉరి వేస్తున్నారు అంటూ ఆవేదన చెందారు.

ప్రభుత్వాలు సైతం తమకి ఉన్న ఆంగ్ల పిచ్చిలో ఇటు ప్రజలు తమకి ఉన్న నాగరికత పిచ్చితో తెలుగుని తోక్కేస్తున్నారు అంటూ మండిపడ్డారు.మోహం మంచిదే కానీ వ్యామోహం అత్యంత ప్రమాదకరమైనదిని అన్నారు.

తెలుగుని అందరూ బ్రతికించుకోవాలని అన్నారు.అందుకు అందరూ కృషిచేయాలి పిలుపు ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube