చిరంజీవికి చేతగాని పనులు చేయకని చెప్పా : యండమూరి  

yandamuri veerendranath sensational comments about chiranjeevi, chirenjeevi, mrugaraju movie, nagababu, political entry comments, yanadamuri veerendranath - Telugu Chiranjeevi, Mrugaraju Movie, Nagababu, Political Entry Comments, Yandamuri Veerendranath

రచయితగా ఎన్నో అద్భుతమైన నవలలు రాసి తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రచయితల్లో యండమూరి వీరేంధ్రనాథ్ ఒకరు.ఆయన నవలల్లో 20కు పైగా నవలలు తెలుగులో సినిమాలుగా తెరకెక్కాయి.

TeluguStop.com - Yandamuri Veerendranath Sensational Comments About Chiranjeevi

యండమూరి పలు సినిమాలకు మాటల రచయితగా పని చేయడంతో పాటు అగ్నిప్రవేశం, స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినిమాలకు దర్శకునిగా కూడా పని చేశారు.వ్యక్తిత్వ వికాస నిపుణునిగా సైతం యండమూరికి మంచి పేరుంది.

అయితే రచయితగా గొప్ప పేరు తెచ్చుకున్న యండమూరి పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచారు.ఆయన రచనల్లో కొన్ని కాపీ అనే ఆరోపణలు వ్యక్తమైనా ఆయన రచనలను ఇష్టపడే పాఠకులు లక్షల సంఖ్యలో ఉన్నారు.

TeluguStop.com - చిరంజీవికి చేతగాని పనులు చేయకని చెప్పా : యండమూరి-General-Telugu-Telugu Tollywood Photo Image

మెగాస్టార్ చిరంజీవి నటించిన కొన్ని సినిమాలు యండమూరి నవలల ఆధారంగా తెరకెక్కాయి.అయితే చిరంజీవి, యండమూరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో గతంలో ప్రచారం జరిగింది.

Telugu Chiranjeevi, Mrugaraju Movie, Nagababu, Political Entry Comments, Yandamuri Veerendranath-Latest News - Telugu

తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవితో గొడవల, విభేదాల గురించి మాట్లాడుతూ యండమూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మృగరాజు సినిమా సమయంలో తనకు, చిరంజీవికి కొన్ని గొడవలు జరిగినట్టు ప్రచారం జరిగిందని అయితే ఆ ప్రచారంలో నిజం లేదని యండమూరి అన్నారు.ఆ సినిమా సమయంలో కొడుకు పెళ్లి కోసం డబ్బు అవసరమైతే మృగరాజు కథ విషయంలో సహాయం చేశానని మృగరాజు సినిమా నిర్మాత అయిన నాగబాబు 4 లక్షలు ఇచ్చారని యండమూరి చెప్పారు.

అయితే చిరంజీవి రాజకీయాల్లోకి వెళతానని చెప్పడం తనకు నచ్చలేదని అది చేతకాని పని అని తాను అన్నానని తెలిపారు.

ఒక ఛానల్ లో చిరంజీవికి రాజకీయాలు సరిపడవని తాను చేసిన వ్యాఖ్యల వల్ల తనకు చిరంజీవికి విభేదాలు వచ్చాయని తాను చేసిన వ్యాఖ్యలు చిరంజీవిని నొప్పించాయని అసలు విషయం చెప్పారు.

#PoliticalEntry #Nagababu #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Yandamuri Veerendranath Sensational Comments About Chiranjeevi Related Telugu News,Photos/Pics,Images..