చిరంజీవి దొంగ మొగుడు మూవీ రీమేక్... ఓటీటీ రిలీజ్

చిరంజీవి కెరియర్ లో దొంగమొగుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.హీరోయిన్ మాధవి భర్త స్థానంలో చిరంజీవి ఇంట్లోకి రావడం.

 Yandamuri Remake Donga Mogudu Movie-TeluguStop.com

అక్కడ చేసే హంగామా వెరసి అవుట్ అండ్ అవుట్ కామెడీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కింది.చిరంజీవి ఈ మూవీలో డ్యూయల్ రోల్ లో కనిపించి సందడి చేశాడు.

ఒక పాత్రలో దొంగగా మరో పాత్రలో బిజినెస్ మెన్ గా కనిపస్తాడు.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

 Yandamuri Remake Donga Mogudu Movie-చిరంజీవి దొంగ మొగుడు మూవీ రీమేక్… ఓటీటీ రిలీజ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దొంగ మొగుడు సినిమా యండమూరి వీరేంద్రనాథ్ నల్లంచు తెల్లచీర అనే నవల ఆధారంగా తెరకెక్కింది.ఇక డిఫరెంట్ పాయింట్ తో పాత్రలు మార్చుకొని ఒకరి స్థానంలో మరొకరు వెళ్ళడం అనే ఎలిమెంట్ ఈ సినిమా సక్సెస్ లో ఒక భాగం అయ్యింది.

దీంతో సినిమా అప్పట్లో ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది.

అయితే మళ్ళీ 34 ఏళ్ల తర్వాత అదే నవలని యండమూరి వీరేంద్రనాథ్ స్వీయ దర్శకత్వంలో మళ్ళీ తెరకెక్కించారు.

అందరూ కొత్తవాళ్లతో ఈ మూవీని భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు.నవలలో ఉన్న కథాంశంతోనే ఈ మూవీని కంప్లీట్ గా యండమూరి ఆవిష్కరించినట్లు తెలుస్తుంది.

తాజాగా ఈ మూవీటైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.అలాగే త్వరలో ఊర్వశీ ఒటీటీలో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత రామసత్యనారాయణ స్పష్టం చేశారు.

ఒటీటీ కోసమే ఈ మూవీని ప్రత్యేకంగా తెరకెక్కించినట్లు తెలిపారు.ఓ విధంగా చెప్పాలంటే చిరంజీవి దొంగ మొగుడు మూవీని మరోసారి అఫీషియల్ గా రీమేక్ చేసి ప్రేక్షకుల ముందుకి నల్లంచు తెల్లచీర ద్వారా తీసుకొస్తున్నారని చెప్పాలి.

మరి ఈ మూవీ ప్రేక్షకులని ఆకట్టుకుంటుందా లేదంటే దొంగ మొగుడు ఇమేజ్ ని దెబ్బ తీస్తుందా అనేది చూడాలి.

#Yandamuri #YandamuriRemake

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు