జగన్ కు అపాయింట్మెంట్ రాకపోవడానికి కారణం చెప్పిన యనమల  

Yanamala Ramkrishnudu Coments On Ap Cm Jagan-

వైసీపీ అధినేత జగన్ బిజెపి పెద్దలను కలుసుకునేందుకు కొద్దిరోజులుగా ప్రయత్నాలు చేస్తున్నా ఆయనకు అపాయింట్మెంట్ దొరకకపోవడంతో జగన్ రాజకీయ ప్రత్యర్థులు అనేక సెటైర్లు వేస్తున్నారు.తాజాగా టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు జగన్ ఢిల్లీ పర్యటన పై స్పందించారు.

Yanamala Ramkrishnudu Coments On Ap Cm Jagan- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Yanamala Ramkrishnudu Coments On Ap Cm Jagan--Yanamala Ramkrishnudu Coments On Ap Cm Jagan-

జగన్ కేవలం తన మీద ఉన్న కేసులు మాఫీ కోసమే తరచుగా ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని యనమల రామకృష్ణుడు విమర్శించారు.

జగన్ కు అపాయింట్మెంట్ ఇస్తానని పిలిచి ఇప్పటికి రెండుసార్లు నిరాకరించారని, ఆయనకు శిక్ష పడే సమయం తొందర్లోనే ఉండడంతో ఎక్కడ లేని భయం పట్టుకుందని అందుకే జగన్ బాగా భయపడిపోతున్నారు అంటూ విమర్శించారు.

జగన్ ఢిల్లీ వెళ్లడానికి ప్రధాన కారణం తన సొంత కేసులు, కోర్టు హాజరు నుంచి మినహాయింపు, ఫెమా, మనీలాండరింగ్, సి.బి.ఐ , ఈ డి కేసులు తదితర వాటిల్లో జగన్ బాగా ఇరుక్కు పోయారని, అందుకే తనను కాపాడాల్సింది గా వేసుకునేందుకు ఢిల్లీ చుట్టూ జగన్ చక్కెరలు కొడుతున్నారని యనమల విరుచుకుపడ్డారు విమర్శించారు.

తాజా వార్తలు

Yanamala Ramkrishnudu Coments On Ap Cm Jagan- Related....