సీఎం అయినంత మాత్రాన రాజధాని మార్చే అధికారం ఎక్కడిది?

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తనకు తాను అన్ని తనవల్లే అవుతాయని భావిస్తున్నాడు.రాజధాని మార్పు నిర్ణయాన్ని కూడా ఆయన తీసుకోవడం అవివేకం అంటూ తెలుగు దేశం పార్టీ ముఖ్యనేత యనమల రామకృష్ణ అన్నారు.

 Yanamala Ramakrishnudu Comments On Jagan Mohan Reddy-TeluguStop.com

సీఎం అయినంత మాత్రాన రాజధానిని మార్చే హక్కు అధికారం ఆయనకు ఉండవు అంటూ ఈ సందర్బంగా యనమల అన్నారు.నిన్న మండలిలో జరిగిన పరిణామలు అన్ని కూడా పూర్తి రూల్‌ ప్రకారం జరిగాయని, దీన్ని వైకాపా సభ్యులు రాద్దాంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

వైసీపీ సభ్యులు మరియు మంత్రులు నిన్న మండలిలో ప్రవర్తించిన తీరు చాలా దారుణం.ఆ ఫొటోలు మరియు వీడియోలను విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ యనమల అన్నాడు.

రూల్‌ ప్రకారం నేను మంత్రులు మరియు సభ్యులను తమ సీట్లలో కూర్చోవాలంటూ చైర్మన్‌ గారితో చెప్పించాను.అంతే తప్ప ఎక్కడ కూడా తాము అధికార దుర్వినియోగంకు పాల్పడ్డట్లుగా ప్రవర్తించలేదు అంటూ ఆయన పేర్కొన్నాడు.

రైతులు మరియు ప్రజలు కోరుకున్నట్లుగా అమరావతిలోనే రాజధాని కొనసాగించాల్సిందిగా యనమల డిమాండ్‌ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube