టీడీపీ బండారం బయటపెట్టిన యామినీ శర్మ..???  

  • ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేవలం ప్రజాభీష్టం మేరకు మాత్రమే తాను అభ్యర్ధులని ఖరారు చేస్తానని, కులాల లెక్కలు వేయనని, పార్టీ గెలుపు ప్రాతిపదికనే టిక్కెట్లు ఇస్తామని అంటుంటారు. కానీ అలాంటిది ఏమి లేదని, కులం కార్డు ద్వారానే అభ్యర్దిల ఎంపిక ఉంటుందని, మన కులానికి సంభందించిన వాళ్ళు సీఎం ముందు ప్లాకార్డులు పట్టుకుని ధర్నా చేస్తే ఫలితం ఉంటుందని సాక్షాత్తు ఆ పార్టీలో ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తున్న మహిళా నేత యామినీ శర్మ చెప్పడం పెద్ద కలకలం సృష్టిస్తోంది.

  • Yamini Sharma Reveals Reality Of Chandrababu Naidu-Tdp Tdp Candidates Yamini About Naidu Tdp

    Yamini Sharma Reveals Reality Of Chandrababu Naidu

  • ఈ మధ్య కాలంలో టీడీపీలో కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్న మహిళ నేతగా యామినీ బాగా పాపులర్ అయ్యారు. తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేయడంలో ఆమె దిట్టనే చెప్పాలి. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యామినీ ఎన్నికలు ముంచు కొచ్చిన సమయంలో తనకి కూడా టిక్కెట్టు కావాలని అనుకున్న ఆమె సీనియర్స్ కంటే కూడా మాస్టర్ ప్లాన్ వేసింది. అనుకున్నదే తడవుగా తన బుర్రకు పదును పెట్టారు యామినీ.

  • అయితే బుర్రకి పదును పెట్టారు కానీ తానూ మాట్లాడిన ఫోన్ కాల్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేస్తుందని అనే విషయాన్ని మాత్రం మర్చిపోయారు. అయితే ఆమె ఆ ఫోన్ కాల్ మాట్లాడిన వాళ్ళు లీక్ చేశారా లేదా మరెలాగైనా ఈ విషయం బయటకి వచ్చిందా అంటే తెలియదు కాని మొత్తానికి యామినీ మాట్లాడిన సంభాషణ ఆమె రాజకీయ భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపనుందని అంటున్నారు. ఇంతకీ ఆమె ఏమి మాట్లాడింది అంటే.

  • Yamini Sharma Reveals Reality Of Chandrababu Naidu-Tdp Tdp Candidates Yamini About Naidu Tdp
  • ‘ ఇతర కులాల వాళ్లు వాళ్ల కులపోళ్ళతో ధర్నాలు చేయిస్తున్నారు. టిక్కెట్లు సాధిస్తున్నారు. అయితే మనకి కూడా టిక్కెట్లు రావాలంటే తప్పకుండా మనం కూడా ఆందోళన చేపట్టాల్సిందే. లేదంటే మనకి టిక్కెట్లు రావు.అందుకే కనీసం ఓ 20 నుంచి 30 మంది అయినా ఆందోళన చేస్తే నేను ఆ ఆందోళనను మీడియాలో హైలెట్ చేయిస్తా. నాకు పరిచయం ఉన్న వారితో మాట్లాడుతా అప్పుడు మనకి టిక్కెట్లు ఇచ్చే విషయంలో చంద్రబాబు ఆలోచిస్తారు అంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా మారు మొగిపోతున్నాయి. సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఆ నోటా ఈ నోటా చంద్రబాబు వరకూ ఈ విషయం వెళ్ళిందని అంటున్నారు. మరి యామిని కి టిక్కెట్టు ఖరారు చేసే విషయంలో కానీ, పార్టీ క్రమశిక్షణ తప్పి పార్టీ పరువు పోయేలా చేసిన ఆమె వైఖరి పట్లగాని అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.