ఆ రీజన్ వల్లే ఆదిత్యతో ప్రేమలో పడ్డా.. యామీ గౌత‌మ్ కీలక వ్యాఖ్యలు...

తక్కువ సినిమాల్లోనే నటించినా నటిగా యామీ గౌతమ్ తెలుగుతో పాటు ఇతర భాషల్లో మంచి పేరును సంపాదించుకున్నారు.సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న యామీ గౌతమ్ గత నెలలో ఆదిత్య ధార్ అనే దర్శకుడిని పెళ్లి చేసుకుని నెటిజన్లను అవాక్కయ్యేలా చేశారు.

 Yami Gautham Reveals Love Story Marriage Adithya Dhar-TeluguStop.com

ఉల్లాస ఉత్సాహ అనే కన్నడ సినిమాతో నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన యామీ గౌతమ్ తెలుగులో నువ్విలా సినిమాతో హిందీలో విక్కీ డోనర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలు సక్సెస్ సాధించడంతో పాటు నటిగా యామీ గౌతమ్ కు మంచి పేరును తెచ్చిపెట్టాయి.

యామీ గౌతమ్ దర్శకుడు ఆదిత్యను పెళ్లి చేసుకున్న సమయంలో ఆమె పెళ్లి గురించి అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.తాజాగా మీడియాతో మాట్లాడిన యామీ గౌతమ్ తన లవ్ స్టోరీ గురించి కీలక విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

 Yami Gautham Reveals Love Story Marriage Adithya Dhar-ఆ రీజన్ వల్లే ఆదిత్యతో ప్రేమలో పడ్డా.. యామీ గౌత‌మ్ కీలక వ్యాఖ్యలు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఉరి మూవీ ప్రమోషన్స్ టైమ్ లో ఆదిత్యతో తాను ప్రేమలో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు.

ఉరి మూవీ షూటింగ్ టైమ్ లోనే ఆదిత్యతో తనకు పరిచయం ఏర్పడిందని తనతో ఫ్రెండ్ షిప్ తర్వాత లవ్ గా మారిందని ఆమె అన్నారు.ఆదిత్య ఇతరుల విషయంలో మర్యాదగా ఉంటారని ఆదిత్యలోని క్వాలిటీస్ నచ్చి ప్రేమలో పడ్డానని యామీ గౌతమ్ అన్నారు.తనతో చాలామంది ఆదిత్య మంచివాడని చెప్పారని అతనితో పరిచయం ఏర్పడ్డాక ఆ విషయం నిజమేనని అర్థమైందని యామీ గౌతమ్ వెల్లడించారు.

ఆర్భాటలతో మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేకే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మ్యారేజ్ చేసుకున్నానని యామీ గౌతమ్ వెల్లడించారు.కరోనా వల్ల కొంతమంది స్నేహితులకు సమాచారం ఇవ్వలేదని వాళ్లు తమకు పరిస్థితి అర్థం చేసుకొని అండగా నిలిచారని యామీ గౌతమ్ పేర్కొన్నారు.

#Director #YamiGautam #Love Story #Yami Gautam #YamiGautam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు