అందరినీ సంతృప్తిపరచడం నావల్ల కాదు.. అందుకే పెళ్లి చేసుకున్న: నటి యామీ గౌతమ్

Yami Gautam Reveals How She Fell In Love With Husband Aditya Dhar

బాలీవుడ్ నటి యామీ గౌతమ్ మనందరికీ సుపరిచితమే.ఈమె తాజాగా నవంబరు 28న తన బర్త్ డే జరుపుకుంది.

 Yami Gautam Reveals How She Fell In Love With Husband Aditya Dhar-TeluguStop.com

ఈ సందర్భంగా ఆమె ఇంటర్వ్యూలో తన వివాహ బంధం గురించి పలు విషయాలను పంచుకుంది.గత ఏడాది ప్రముఖ దర్శకుడు నిర్మాత అయినా ఆదిత్య ధర్ ను పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.

ఈ క్రమంలోనే తమ వివాహ బంధం గురించి, తన భర్త గురించి పలు విషయాలను వెల్లడించింది.

 Yami Gautam Reveals How She Fell In Love With Husband Aditya Dhar-అందరినీ సంతృప్తిపరచడం నావల్ల కాదు.. అందుకే పెళ్లి చేసుకున్న: నటి యామీ గౌతమ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరిద్దరికీ ఒక షూటింగ్ సమయంలో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లిందని ఆమె చెప్పుకొచ్చింది.

వారి పెళ్లిని హంగులు ఆర్భాటాలు లేకుండా అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య జరుపుకున్నామని తెలిపింది.ఆమె భర్త విలువలతో కూడిన వ్యక్తిత్వం అని, పనిని కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసే విధానం అందరినీ ఆకర్షించేలా ఉంటుందని చెప్పుకొచ్చింది.

అలాగే తన పెళ్లి భారీ వేదికలో చేసుకోవడం తనకు ఇష్టం లేదని.

Telugu Actressyami, Aditya Dhar, Bollywood, Love, Yami Gautam, Yami Gautham-Movie

మీరు చేసే పనుల నుంచి మీకు గౌరవం లభిస్తుంది.కానీ ఇతరులకు మెప్పించాలి అంటే మన జీవితం సరిపోదని ఆమె తెలిపింది.ఏదేమైనప్పటికీ పెళ్లి చేసుకున్న తరువాత సంతోషంగా ఉండాలి ప్రస్తుతం మేము కూడా సంతోషంగా ఉన్నాం మా కుటుంబాలు కూడా ఆనందంగా ఉన్నాయి.

అలాగే మన సాంప్రదాయాలు నాకు చాలా ముఖ్యం.కరోనా లేకపోయినప్పటికీ మా పెళ్ళి ఇలానే ఎటువంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా జరిగేది అంటూ యామి గౌతమ్ వివరించింది.

#ActressYami #Aditya Dhar #Aditya Dhar #Love #Yami Gautham

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube