యమ సరస్సు... చావు భయం పోగొట్టే మహిమ గల సరస్సు ఎక్కడుంది, చరిత్ర తెలుసా మీకు?  

Yama Lake Which Takes Away Fear Of Death-general Telugu Updates,history,lion,tamil Nadu,yama Lake,years Ago

మనిషి అన్న ప్రతి ఒక్కడికి చావు వస్తుంది, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు. అయితే ఎప్పుడో రాబోతున్న చావు గురించి కొందరు తెగ భయపడుతూ ఉంటారు. చనిపోతానేమో, ఆ పన చేస్తే చంపేస్తారేమో, ఇలా చేస్తే చనిపోతానేమో అనే భయం అందరిలో ఉంటుంది..

యమ సరస్సు... చావు భయం పోగొట్టే మహిమ గల సరస్సు ఎక్కడుంది, చరిత్ర తెలుసా మీకు?-Yama Lake Which Takes Away Fear Of Death

చావు రాకముందే చనిపోయేలా భయపడే వారు ఎంతో మంది ఉంటారు. వారందరి కోసం ఈ భూమి మీద ఒకే ఒక్క సరస్సు ఉంది. ఆ సరస్సులో స్నానం చేసిన వారు చావు భయం పోగొట్టుకుంటారు.

చావు కూడా ఆలస్యంగా వస్తుందని అక్కడి వారి నమ్మకం.

యము కట్టించిన ఆ సరస్సు గురించి తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున నమ్మకం ఉంది. తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువైకాపూర్‌ అనే చిన్న గ్రామంలో ఒక గుడి ఉంటుంది.

ఆ గుడిలో ఉన్న సరస్సును స్వయంగా యమ ధర్మ రాజు నిర్మించాడని, శివుడి ఆజ్ఞానుసారం యమ ధర్మ రాజు ఆ సరస్సులో స్నానం చేసిన వారిని భయ పెట్టడని చెబుతూ ఉంటారు. ప్రతి రోజు కొన్ని వందల మంది ఆ సరస్సులో స్నానం చేసేందుకు వస్తారు. తంజావూరు జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా ఈ సరస్సులో స్నానం చేసేందుకు జనాలు వస్తూ ఉంటారు.

కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక వేటగాడు జింకను తరుముకుంటూ ఈ ప్రదేశానికి వచ్చాడట. గుడి ఉన్న ప్రదేశంలో వేటగాడు వెళ్లగానే ఒక సింహం గాండ్రింపు వినిపించింది. దాంతో ఆ వేటగాడు చావు భయంతో గుడి ప్రాంగణంలో ఉన్న చెట్టుపైకి ఎక్కాడు. అతడు ఎక్కిన చెట్టు కింద శివ లింగం ఉంది.

రాత్రి అంతా కూడా ఆ వేటగాడు శివలింగంపై తాను కూర్చుని ఉన్న బిల్వ చెట్టు ఆకులను తెంచుతూ వేయడం చేశాడు. రాత్రి అంతా కూడా నిద్ర పోకుండా ఒక్కో ఆకును శివలింగంపై వేయడం జరిగింది. దాంతో బిల్వ ఆకుల అభిషేకంకు ప్రసన్నం అయిన శివుడు ఆ వేటగాడికి ఉన్న చావు భయంను పోగొట్టాలనుకున్నాడు..

యముడిని పిలిచి ఈ ప్రదేశంలో ఒక సరస్సు ఏర్పాటు చేయమని, దానిలో స్నానం చేసిన వారికి చావు భయం లేకుండా చేయమని ఆదేశించాడు. అలా శివుడి ఆజ్ఞతో యముడు ఈ సరస్సును ఏర్పాటు చేశాడు. అందుకే దీనికి ఇంత ప్రాముఖ్యత ఉందని స్థానికులు చెబుతున్నారు.