ఒకప్పుడు స్టార్ హీరో తో నటించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం అవకాశాలు లేక….  

Yagnam movie fame Sameera Banerjee real life news, Sameera Banerjee, Telugu heroine, Yagnam movie, Gopi Chand, Tollywood, - Telugu Gopi Chand, Sameera Banerjee, Telugu Heroine, Tollywood, Yagnam Movie, Yagnam Movie Fame Sameera Banerjee Real Life News

తెలుగులో టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటించిన “యజ్ఞం” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన కోల్కతా బ్యూటీ “సమీరా బెనర్జీ” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే అప్పట్లో “యజ్ఞం చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడంతో పాటు దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

TeluguStop.com - Yagnam Movie Fame Sameera Banerjee Real Life News

అంతేకాక అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న గోపీచంద్ సినీ కెరియర్లో చెరిగిపోని మైలు రాయిగా నిలిచి పోయింది. కానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన “సమీరా బెనర్జీ” కి మాత్రం ఈ చిత్రంలో నటించిన తర్వాత ఎలాంటి సినిమా అవకాశాలు తలుపు తట్టలేదు.

అయినప్పటికీ సమీరా బెనర్జీ దాదాపుగా 4,5 సంవత్సరాలు అవకాశాల కోసం సినిమా పరిశ్రమలో బాగానే ఎదురు చూసింది.కానీ ఈ అమ్మడికి మాత్రం ఎలాంటి అవకాశాలు వరించ లేదు.

TeluguStop.com - ఒకప్పుడు స్టార్ హీరో తో నటించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం అవకాశాలు లేక….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ఇక చేసేదేమీలేక మూటాముల్లె సర్దుకుని తన స్వస్థలం అయిన కోల్కతా కి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో లో పలు సీరియళ్ళకి నిర్మాతగా వ్యవహరించిన “నీరజ్ శర్మ” అనే  సీరియల్ నిర్మాతని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

 ప్రస్తుతం వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.అయితే ఇటీవలే సమీరా బెనర్జీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆమె అనుకున్న పాత్రలో నటించే అవకాశాలు రాకపోవడంతో కొంతమేర ఆచితూచి అడుగులు వేస్తోంది.

దీంతో ప్రస్తుతం పలు బెంగాలీ ధారావాహికలలో అత్త, అమ్మ, వదిన, తదితర పాత్రలలో నటిస్తోంది.ఏదేమైనప్పటికీ తెలుగులో గోపీచంద్ వంటి స్టార్ హీరో సరసన నటించి హిట్ కొట్టినప్పటికీ సమీరా బెనర్జీ తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా నిలదొక్కుకోలేక పోయింది.

#YagnamMovie #Gopi Chand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Yagnam Movie Fame Sameera Banerjee Real Life News Related Telugu News,Photos/Pics,Images..