యాదమ్మ రుచులు అదుర్స్.. టెస్ట్ చేసిన మోడీ..

హైదరాబాద్ హెచ్‎సీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అట్టహాసంగా జరుగుతున్నాయి.ఈ సమావేశాలకు ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు.

 Yadamma Flavors Are Tested By Modi  Modi, Bjp, Bjp , National Working Committee-TeluguStop.com

ఇవాళ రెండో రోజు కూడా సమావేశాలు జరుతున్నాయి.తొలి రోజు దేశాభివృద్ధిపై చర్చించారు.

నేడు రాజకీయ తీర్మాలకు ఆమోదం తెలపనున్నారు.అలాగే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‎లో మోదీ భారీ బహిరంగ సభ జరగనుంది.

ఈ సభకు అన్ని ఏర్పాట్లు చేశారు.ఇదిలా ఉంటే ఈ రెండు రోజులు పాటు హైదరాబాద్‎లో ఉన్న బీజేపీ నేతలకు సకల సౌకర్యాలు కల్పించారు.

భోజన, బస ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ నేతలు దగ్గరుండి చూస్తున్నారు.తెలంగాణ వంటకాను ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలకు రుచి చూపించారు.

మరోవైపు ఈ సమావేశాలతో రాష్ట్ర బీజేపీ కేడర్‎లో ఫుల్ జోష్ నెలకొంది.వచ్చే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ నేతలు చేసిన దిశానిర్ధేశంతో నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.బీజేపీ దిగ్గజాలు ఈ రోజు తెలంగాణ వంటకాల రుచి చూడబోతున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి గుడాటిపల్లెకి చెందిన యాదమ్మ చేతితో చేసిన వంటకాలను ప్రముఖులందరు టేస్ట్ చేయబోతున్నారు.భోజనంతో పాటు స్నాక్స్ సైతం తెలంగాణ స్టయిల్ లోనే తయారు చేస్తున్నారు.

స్వీట్స్ సైతం తెలంగాణ తినుబండారాలనే వడ్డిస్తుండటం విశేషం.స్వీట్స్ సహా దాదాపు 50 రకాల వంటకాలను అతిరథ మహారథుల కోసం స్పెషల్ మోనూ ఫైనల్ చేశారు.

అవన్నీ స్వయంగా యాదమ్మ చేతితోనే చేస్తుండటం గమనార్హం.

Telugu Jp Nadda, Modi, Rajnath Singh, Smriti Irani, Yadamma-Political

ఇక వంటల విషయానికి వస్తే చిక్కుడుకాయ టమోటా, ఆలు కూర్మ, వంకాయ మసాలా కర్రీ, దొండకాయ పచ్చికొబ్బరి తురుము ఫ్రై, బెండకాయ కాజు పల్లీల ఫ్రై, తోటకూర టమోటా ఫ్రై, బీరకాయ మిల్ మేకర్ చూర ఫ్రై, మెంతికూర పెసరపప్పు ఫ్రై, గంగవాయిలకూర, మామిడికాయ పప్పు, సాంబారు, ముద్దపప్పు, పచ్చిపులుసు, బగార, పులిహోర, పుదీనా రైస్, వైట్ రైస్, పెరుగన్నం, గోంగూరు పచ్చిడి, దోసకాయ ఆవ చట్నీ, టమోటా చట్నీ, సొరకాయ చట్నీలను చేస్తున్నారు.వీటితో పాటు స్వీట్స్ బెల్లం పరమాన్నం, సేమియా పాయసం, భక్షాలు, బూరెలు, అరిసెలు సిద్ధం చేస్తున్నారు.స్నాక్స్ విషయానికొస్తే … పెసరపప్పు గారెలు, సకినాలు, మక్క గుడాలు, సర్వపిండి, టమోటా చట్నీ, పల్లీ చట్నీ, పచ్చి కొబ్బరి చట్నీ, మిర్చిలను వేయబోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube