తెలంగాణలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy Venkat Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.యాదాద్రి కాదు.
ఇకపై యాదగిరిగుట్టనేనని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం( Yadadri Laxmi Narasimha Swamy ) పేరును యాదగిరి గుట్టగా మారుస్తామని తెలిపారు.
ఈ పేరు మార్పుపై త్వరలోనే జీవో ఇస్తామని వెల్లడించారు.అదేవిధంగా యాదగిరి గుట్టపై భక్తుల కోసం డార్మిటీ హాల్ నిర్మిస్తామన్నారు.
క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) భావిస్తున్నారన్న మంత్రి కోమటిరెడ్డి ఆలయ పూజారుల కోసం విశ్రాంతి గదులను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.