దసరాకు యాదాద్రి ఆలయం సిద్దమంట

కరోనా వైరస్ వంటి దారుణమైన పరిస్థితిలోను యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయ విస్తిరణ పనులు జరుగుతున్నాయి.ప్రస్తుతం ఆలయానికి సంబంధించి ప్రధాన కట్టడాలు పూర్తయ్యాయి.

 Yadadri, Lakshmi Narasimha Swamy, Temple Development Authority, Geetha Reddy, Te-TeluguStop.com

దీంతో ప్రధానాలయం, శివాలయాలకు చివరి పనులు పూర్తి చేస్తున్నారు.అయితే కరోనా వైరస్ సమస్య పోయి.

పరిస్థితి చక్కబడితే విజయదశమి నాటికీ యాదాద్రి ఆలయం సిద్ధం అవుతుంది అని ఆలయాభివృది ప్రాధికార సంస్ద చెప్పుకొచ్చింది.

ఇకపోతే ఈ ఆలయంలో ఎక్కడ లేని విధంగా ఆలయాన్ని కృష్ణశిలలతో నిర్మిస్తున్నట్టు చెప్పారు.

కాగా యాదాద్రి క్షేత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యద్భుతంగా తీర్చిదిద్దాలి అని కేసీఆర్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.ఇంకా ఈ ఆలయం నిర్మాణం 2016లో ప్రారంభం కాగా అప్పటి నుండి ఇప్పటి వరకు రూ.900 కోట్లకు పైగా నిర్మాణ పనులు జరిగాయి.

900 కోట్లలోనూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 740 కోట్ల రూపాయిలు చెల్లించింది.ఆలయ పనులు పూర్తయ్యాకా పూర్తి డబ్బు చెల్లించనున్నారు.ఇంకా వచ్చే బ్రహ్మోత్సవాలను ప్రధానాలయంలో నిర్వహించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నట్టు ఆలయ ఈవో గీతారెడ్డి మీడియాకు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube