జ‌గ‌న్ బాబాయ్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఒక్క దెబ్బ‌కు చెక్ పెట్టారుగా…!  

వైసీపీ కీల‌క నాయ‌కుడు, టీటీడీ బోర్డు చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం.వైసీపీకి ఎంత వ‌ర‌కు మేలు చేస్తుంది?  ఏమేర‌కు రాజ‌కీయంగా ఇది వినియోగ ప‌డుతుంది?  ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న మార్కును తుడిచేస్తుందా? ఇవీ.ఇప్పుడు వైసీపీలో వినిపిస్తున్న వ్యాఖ్య‌లు, సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్న ప్ర‌శ్న‌లు కూడా!  దీనికి కార‌ణం.టీటీడీ ఆస్తుల చిట్టాను వైవీ బ‌హ‌ర్గ‌తం చేశారు.

TeluguStop.com - Y V Subba Reddy Takes Sensational Decision One Step Total Check

ఇప్ప‌టి వ‌ర‌కు తిరుమ‌ల శ్రీవారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఏమేర‌కు ఖ‌ర్చు చేశారు? ఎక్క‌డెక్క‌డ ఏవేవి ఉన్నాయి? అనే అనేక అంశాలు సందేహాలుగానే ఉన్నాయి.ఎవ‌రు ప్ర‌తిప‌క్షంలో ఉంటే.

వారు.శ్రీవారి ఆస్తుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

TeluguStop.com - జ‌గ‌న్ బాబాయ్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఒక్క దెబ్బ‌కు చెక్ పెట్టారుగా…-General-Telugu-Telugu Tollywood Photo Image

గ‌తంలో వైసీపీ శ్రీవారి ఆస్తులు చంద్ర‌బాబు ఖ‌జానాకు చేరాయ‌ని విమ‌ర్శించింది.

ఇక‌, ఇప్పుడు టీడీపీ కూడా ఇలాంటి వ్యాఖ్య‌ల‌నే చేస్తోంది.

టీటీడీ ఆస్తుల‌ను జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వ పాల‌న‌కు వినియోగించేస్తున్నార‌ని కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు విమ‌ర్శ‌లు గుప్పించింది.దీంతో బీజేపీ వ్యూహాత్మ‌కంగా దాడులు ప్రారంభించి.

వైసీపీకి ఇరుకున ప‌డేసింది.టీటీడీ ఆస్తుల‌పై శ్వేత ప‌త్రం ప్ర‌క‌టించాల‌ని.

ద‌మ్ముంటే.ఆ ప‌నిచేసి చూపించాల‌ని.

బీజేపీ నాయ‌కులు భారీ ఎత్తున డైలాగులు పేల్చారు.అయితే.

చంద్ర‌బాబు హ‌యాంలోనూ ఇలానే డిమాండ్లు వినిపించినా.ఆయ‌న ప‌ట్టించుకోలేదు.

అయితే.జ‌గ‌న్ మాత్రం ప‌ట్టించుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఎందుకంటే.ఆయ‌న క్రిస్టియ‌న్ కాబ‌ట్టి.

టీటీడీని ప‌ట్టించుకోవ‌డం లేద‌నే మ‌రో ప్ర‌చారం కూడా ఉంది.

ఇక‌, ఇప్పుడు త్వ‌ర‌లోనే తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

ఈ క్ర‌మంలో మ‌రోసారి తిరుమల శ్రీవారి ఆల‌యంలో దోపిడీ జ‌రుగుతోంద‌ని.రెడ్లు-రెడ్లు కుమ్మ‌క్క‌యి.శ్రీవారి ఆస్తుల‌ను పంచేసుకుంటున్నార‌నే ప్ర‌చారం జ‌రిగినా జ‌ర‌గ‌వ‌చ్చు.ఇక‌, ఇలాంటి ప్ర‌చారం జ‌రిగితే.త‌మ‌కు ఏ రూపంలోనూ మంచి ది కాద‌ని భావించిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెంట‌నే శ్రీవారి ఆస్తుల వివ‌రాల‌ను వెబ్‌సైట్‌లో పెట్టాల‌ని టీటీడీని ఆదేశించిన‌ట్టు కొన్నాళ్లు కింద‌ట ఓ గుసగుస వినిపించింది.అయితే.

అప్ప‌ట్లో వైవీ ఖండించారు.శ్వేత ప‌త్రం విడుద‌ల చేస్తాం కానీ.

కుద‌ర‌ద‌న్నారు.

కానీ, వ్యూహాత్మ‌కంగా ఇప్పుడు విడుద‌ల చేశారు.శ్రీవారికి ఎక్క‌డెక్కడ ఎలాంటి ఆస్తులు ఉన్నాయో.చెప్పారు.

ఎంత భూములు ఉన్నాయో లెక్క‌తేల్చారు.దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు అటు టీడీపీ, ఇటు బీజేపీ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టిన‌ట్ట‌యింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇది.వ‌చ్చే తిరుప‌తి ఉప పోరులో ప్ర‌భావం చూపిస్తుంద‌ని అంటున్నారు.మ‌రీ ముఖ్యంగా టీటీడీని కేంద్రంగా చేసుకుని విమ‌ర్శించే చాన్స్ లేకుండా చేశార‌ని అంటున్నారు.

#Ysrcp #AP Politics #Lord Balaji #Web Site #Chandra Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Y V Subba Reddy Takes Sensational Decision One Step Total Check Related Telugu News,Photos/Pics,Images..