వైరల్‌ : కరోనా వల్ల 30 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలిశాడు

ప్రపంచం మొత్తం కరోనా కంగారు పెడుతూ ఉంటే ఒక్కరు ఇద్దరు మాత్రం కరోనా కారణంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కరోనా వైరస్‌ వల్ల జీవితాల్లో అనూహ్య మార్పులు వచ్చిన వారు కొందరు ఉన్నారు.

 Xu Xiaoming 57 Years Family Corona Virus-TeluguStop.com

వారు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు.వారిలో ఒకరు చైనాకు చెందిన 57 ఏళ్ల జు జియామింగ్‌.1990 సంవత్సరంలో ఈయన ఉబెయిన్‌ ప్రావిన్స్‌కు బ్రతుకుదెరువు కోసం వెళ్లాడు.అక్కడ ఆయన కొంత కాలం పని చేసిన తర్వాత యాక్సిడెంట్‌కు గురి అయ్యాడు.

ఆ యాక్సిడెంట్‌ తర్వాత అతడు గతం అంతా మర్చి పోయాడు.యాక్సిడెంట్‌ సమయంలో అతడి వద్ద ఉన్న ఐడెంటీ కార్డులు ఇంకా ఇతర ఐడెంటిఫికేషన్స్‌ అన్ని కూడా పోగొట్టుకున్నాడు.

దాంతో అతడు రోడ్లపై తిరుగుతూ ఉన్నాడు.ఆ సమయంలో ఒక ఫ్యామిలీ అతడిని ఆధరించారు.

అతడిని తమ కుటుంబంలో ఒక్కడిగా చేర్చుకున్నారు.అయితే అతడు మాత్రం ఎక్కువగా తన కుటుంబ సభ్యుల గురించి తన కుటుంబం గురించి తన ఊరు గురించి ఆలోచిస్తూ ఉండేవాడు.

చిన్న క్లూ కోసం అతడు వెదుకుతూనే ఉండేవాడు.
అలాంటి సమయంలో అతడి గ్రామంలో ఒక కరోనా మృతి సంభవించింది అంటూ మీడియాలో వార్త వస్తోంది.

మీడియాలో ఆ వార్తను చూడగానే అది తన గ్రామం అని గుర్తించాడు.వెంటనే సమీపంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి విషయాన్ని వెళ్లడి చేయగా వారు అక్కడి పోలీసులతో కమ్యూనికేట్‌ చేయడం జరిగింది.

అలా తల్లితో మొదట వీడియో కాల్‌ మాట్లాడిన జు జియామింగ్‌ అక్కడకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నాడు.

వైరల్‌ : కరోనా వల్ల 30 ఏళ్ల తర్వ�

ప్రస్తుతం అతడు ఉన్న ప్రాంతం నుండి సొంత గ్రామం 1500 కిలో మీటర్ల దూరంలో ఉంది.ప్రస్తుతం కరోనా ప్రభావం వల్ల ప్రయాణం ఆలస్యం అవుతుంది.త్వరలోనే తన కుటుంబ సభ్యులను కలవబోతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు.

జు జియామింగ్‌కు నలుగురు తోబుట్టువులు ఉన్నారు.జు జియామింగ్‌ తప్పి పోయిన తర్వాత అతడి తండ్రి మరణించాడు.

తండ్రి మరణ వార్త తెలిసి అతడు బాధపడ్డాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube