ఫోన్ మాట్లాడుతూ సంగీతం వినే కళ్ళ అద్దాలు గురించి మీకు తెలుసా..?!

ఈ కాలంలో యువత ఎక్కువగా ఫ్యాషన్ వైపే మొగ్గు చూపుతున్నారు.ట్రెండీగా కనిపించడానికి మార్కెట్లోకి రిలీజ్ అయిన కొత్త ఐటమ్స్ ను కొనుగోలు చేస్తున్నారు ఈ క్రమంలోనే యువత ఎక్కువగా కంటి అద్దాలను ధరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

 Xiaomi Smart Glasses Will Enable Call And Listen Music And Other Features, Xiomi-TeluguStop.com

కొందరు చూపు సరిగా కనపడటానికి కళ్లద్దాలు ధరిస్తే మరికొందరు మాత్రం ఫ్యాషన్ గా కనిపించడం కోసం కళ్లద్దాలు ధరిస్తారు.ఈ క్రమంలోనే స్మార్ట్‌ గ్లాస్‌ లపై యువత ఆసక్తి కనబరచడంతో షావోమి కంపెనీ ఒక సరికొత్త స్మార్ట్ గ్లాసు లను మనముందుకు తీసుకుని వచ్చింది.

ఇవి అలాంటి ఇలాంటి కళ్లద్దాలు కావండోయ్.ఈ స్మార్ట్‌ గ్లాస్‌ ఎన్నో ప్రత్యేకతలు దాగి ఉన్నాయి.

చూడడానికి కళ్ళద్దాల మాదిరిగానే కనిపిస్తాయి గాని వీటిలో ఎన్నో రకాల ఫీచర్స్ దాగి ఉన్నాయి.ఈ కళ్లద్దాలు 51 గ్రాముల బరువు మాత్రమే ఉంటాయి.

ఇకపోతే డిస్ప్లే విషయానికి వస్తే.ఒక చిప్‌ బియ్యం గింజ సైజ్‌ లో ఇందులో అమర్చబడి ఉంటుంది.అలాగే ఈ అద్దాలపై నొటిఫికేషన్లు కూడా కనిపిస్తాయి.అలా అని ప్రతి చిరాకు తెప్పించే నోటిఫికెషన్స్ ఏమి ఎందులో కనిపించవు.

అలాగే షావోమి కంపెనీ ఏఐ అసిస్టెంట్‌ ‘ప్రైమరీ ఇంటరాక్షన్‌ మెథడ్‌‘ తో హోమ్‌ అలారమ్స్, ఆఫీస్‌ యాప్‌కు సంబంధించిన అర్జెంట్‌ సమాచారం ఇలా ముఖ్యమైనవి మాత్రమే మనం సెట్ చేసి పెట్టుకుంటే కనిపిస్తాయి.ఇక ఇందులో 5mp కెమెరా ఉంటుంది.

ఈ కెమెరాను ఉపయోగించి వీడియోలు, ఫొటోలు తీసుకోవచ్చు.అంతేకాకుండా ఇన్‌బిల్ట్‌ స్పీకర్లు కూడా ఇందులో ఉండడం వలన త్వరగా కాల్స్‌ కూడా స్వీకరించవచ్చు.

అలాగే మీరు మాట్లాడే మాటలను టెక్ట్స్‌ రూపంలో కూడా వచ్చే ఫీచర్‌ ఇందులో ఉంది.

Telugu Latest, Music, Sun Glasses, Ups, Xiaomismart, Xiomismart-Latest News - Te

అయితే ఈ ఆడియో టెక్స్ట్ ఫీచర్ చాలా మందిని ఆకట్టుకుంటుందని షావోమి కంపెనీ తెలిపింది.ఈ ఫీచర్ ను ఉపయోగించి బిజీగా ఉన్న సమయంలో నోటి మాటతో కావలసిన వారికి సందేశం పంపవచ్చు అన్నమాట.అంటే టైప్ చేయాలిసిన పని లేకుండా ఆడియో రూపంలో చెప్తే చాలు ఆటోమాటిక్ గా టైప్ అయిపోతుంది అంట.

‘ మా ఫస్ట్‌ జెనరేషన్‌ స్మార్ట్‌గ్లాస్‌ కనుక మీరు పెట్టుకుంటే ప్రపంచం మీ కళ్ల ముందు ఉంటుంది అంటున్నారు.యూజర్‌ ప్రైవసీని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్‌ గ్లాస్‌ లను డిజైన్‌ చేశారు.

క్లాసిక్, రౌండ్, లార్జ్ ఇలా రేబాన్‌ స్టోరీస్‌లో 20 వేరియంట్స్‌ ఉన్నాయి.ఈ స్మార్ట్‌ గ్లాసులు ధరిస్తే లుక్ తో పాటు గ్లామర్ కూడా ఉంటుంది.చూడడానికి మాత్రం మామూలు అద్దాలుగానే కనిపిస్తాయి.ఇక షావోమి కంపెనీ స్మార్ట్‌ గ్లాస్‌ లను సెప్టెంబర్ 14న లాంచ్ చేయనునట్లు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube