ఇండియాలో ఫ‌స్ట్ రెడ్‌మీ 5జీ మొబైల్‌.. ఫీచ‌ర్స్ అదుర్స్‌!

ప్రస్తుతం ఎవరి చేతుల్లో చూసినా, ఫోన్ పక్కా.చాలా మంది స్మార్ట్ ఫోన్లు వాడుతూ….

 Xiaomi Launches 10t 5g Mobile In India, Redmi, Xiaomi, 10t 5g Mobile Features, R-TeluguStop.com

అప్ టూ డేట్ గా ఉంటుంన్నారు.ఇప్పటికే పలువురు వినియోగదారులు 4జీ ఫోన్లు వాడుతున్నారు.

కానీ మారుతున్న యుగానికి 4జీ ఫోన్లలో వచ్చే డాటా స్పీడ్ సరిపోదని గ్రహించి….ఇప్పటికే అన్ని కంపెనీలు 5జీ ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి.

ఈ క్రమంలోనే అన్ని మొబైల్ కంపెనీలు 5జీ ఫోన్లు విడుదల చేయాలని భావిస్తున్నాయి.ఎలాగైనా 5జీ ఫోన్లను విడుదల చేసి… ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇవ్వాలని నిశ్చయించుకుని….

ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.ప్రముఖ కంపెనీ భారత మార్కెట్ లోకి తన 5జీ ఫోన్ ను విడుదల చేసింది.

అది ఏ కంపెనీ ఫోన్ అంటే….


Telugu Redmi, Redmi Amazon, Xiaomi, Xiaomilaunches-Latest News - Telugu

స్మార్ట్ ఫోన్లను వాడే ప్రతి ఒక్కరికీ షావోమి రెడ్ మీ కంపెనీ గురించి తెలిసే ఉంటుంది.తక్కువ ధరలతో అనేక ఫీచర్లను అందిస్తూ… ఈ కంపెనీ అనేక మంది కస్టమర్లను సంపాధించింది.తాజాగా ఈ కంపెనీయే 5జీ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది.

రెడ్‌ మీ నోట్‌ 10టీ 5జీ పేర ఈ స్మార్ట్ ఫోన్ విడుదలైంది.ఈ ఫోన్ లో రెండు రకాల స్టోరేజీలు అందుబాటులో ఉన్నాయి.

కాగా ఈ నెల 26 నుంచి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌, తమ కంపెనీకే చెందిన ఆన్ లైన్ పోర్టల్ లో ఈ ఫోన్ లు లభించనున్నాయి.ఇక ఫోన్ ధర విషయానికొస్తే… మొదటి నుంచి రెడ్ మీ కంపెనీ బడ్జెట్ ధరల ఫోన్లను విడుదల చేస్తూనే వినియోగదారులను ఆకట్టుకుంది.అలాగే ఈ 5జీ ఫోన్ కు కూడా బడ్జెట్ ధరనే కేటాయించింది.5జీ ఫోన్ లో కూడా 4 జీబీ ఇంటర్నల్+ 64 జీబీ ఎక్స్ టర్నల్ నిల్వ సామర్థాన్ని కలిగిన ఫోన్ కు 13,999 రూపాయలుగా, 6 జీబీ ఇంటర్నల్ + 128 జీబీ ఎక్స్ టర్నల్ నిల్వ సామర్థ్యం ఉన్న ఫోన్ ధరను 15,999 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది.ఇక ఇది భారీ డిస్ ప్లే ను కలిగి ఉంది.ఆండ్రాయిడ్ 11 మరియు ఎంఐయూఐ 12 పై ఇది ఆధారపడి పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. 48 మెగా పిక్సెల్‌ బ్యాక్ కెమెరాతో పాటుగా8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్ కెమెరాను ఇది కలిగి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube