నెటిజెన్ల ట్రోల్స్ కు గురవుతున్న షియోమీ లోగో..!

చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమీ కొత్త లోగోని రిలీజ్ చేసింది.ఒకటి రెండు కాదు 3 లక్షల డాలర్లు ఖర్చు పెట్టి ఈ లోగో తయారు చేయించినట్టు తెలుస్తుంది.అంటే మన లెక్కలో చెప్పాలంటే 2.2 కోట్ల రూపాయలన్నమాట.అంతేకాదు ఈ లోగో తయారీకి 4 సంవత్సరాల కాలం పట్టిందని షియోమీ సంస్థ వెల్లడించింది.అయితే లోగో చూసిన వారు అసలు పాతదానికి కొత్త దానికి ఏం తేడా ఉందని అనుకుంటున్నారు.

 Xiaomi New Logo Trolles From Netizen-TeluguStop.com

షియోమీ అలైవ్ డిజైన్ కాన్సెప్ట్ తో వరల్డ్ ఫేమస్ డిజైనర్, జపాన్ లో ముసాషినో ఆర్ట్ ఆఫ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్యా హరా డిజైన్ చేశారు.

లోగో చతురస్రాకారం నుంచి వృత్త చతురస్రాకారంలోకి మార్చడం తమ కంపెనీ అంతర్గత స్పిరిట్ ను.బ్రాండ్ స్వభావాన్ని మార్చామని చెబుతున్నారు.గణిత శాస్త్రానికి సంబందించిన సిద్ధాంతాలు కూడా ఈ కొత్త లోగో ఉందని చెబుతున్నారు.

అంతా బాగుంది కాని ఈ లోగోని తయారు చేయడానికి ఇన్నేళ్లు.ఇంత ఖర్చు పెట్టారా.10 రూపాయలు కర్చు పెట్టి 10 నిమిషాల్లో ఈ లోగో వస్తుందని ట్రోల్ చేస్తున్నారు.నిజంగానే నెటిజెన్లు అంటున్నట్టుగానే రెండు కోట్లు ఖర్చు పెట్టి చేసినా పెద్దగా మార్పు కనిపించకపోవడంతో నెటిజెన్లు దీనిపై ట్రోల్స్ చేస్తున్నారు.

ఇండియన్ మొబైల్ మార్కెట్ లో షియోమీ ఫోన్ లకు మంచి డిమాండ్ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube