షియోమీ నుండి మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్..!

చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షియోమీ తన కొత్త రకం మోడల్లను ఇండియా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది ఎంఐ 11 అల్ట్రా ను భారత్ మార్కెట్ లోకి ఏప్రిల్ 23న రిలీజ్ చేస్తుంది.షియోమీ ఎంఐ 11 సీరీస్ లలో ఎంఐ 11, 11 ప్రో, 11 అల్ట్రా, 11ఐ, ఎంఐ 11 లైట్ తో మొత్తం ఐదు రకాల ఫోన్లను రిలీజ్ చేస్తుంది.11 అల్ట్రా 5జి కనెక్టివిటీ పాటుగా ఏఐ, సూపర్ కెమెర వర్క్, గేమింగ్ కు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.అంతేకాకుండా మరికొన్ని అద్భుతమైన ఫీచర్స్ తో వస్తుంది.

 Xiaomi Launching 11 Ultra And Other 11 Series Phones Releasing On April 23-TeluguStop.com

ఈ ఎంఐ 11 సీరీస్ మొత్తం స్నాప్ డ్రాగన్ 888 SoC తో పనిచేస్తాయని తెలుస్తుంది.

ఇక స్పెషికేషన్స్ విషయానికి వస్తే.ఆండ్రాయిడ్ 11 తో ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టెం తో పనిచేస్తుంది.6.81 ఇంచెస్ 2కే డబ్యల్యూక్యూ హెచ్ డీ + ఈ4 అమోఎల్.ఈ.డీ డిస్ ప్లే అందుబాటులో వస్తుంది.కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా కంపెనీ అందించడం విశేషం.ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది.12 జిబీ ర్యాం, 512 జిబి స్టోరేజ్ ఇందులో చేసుకోవచ్చు.ఇక కెమెరాల విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మూడు కెమెరాలు ఉంటాయి.అందులో మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ తో వస్తుంది.మిగతా రెండు 48 మెగాపిక్సెల్ సెన్సార్లు కలిగి ఉన్నాయి.మూడు కెమెరాలు 8కె వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తాయి.

 Xiaomi Launching 11 Ultra And Other 11 Series Phones Releasing On April 23-షియోమీ నుండి మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సెల్ఫీల కోసం ముందు 20 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.

#Xiaomi11 #Xiaomi India #ChinaSmart #Xiaomi #XiaomiLatest

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు