షావోమీ సరికొత్త స్మార్ట్ ఫ్యాన్.. అదిరిపోయే ఫీచర్లు

ఏదైనా టేబుల్ ఫ్యాన్ మీరు ఇంట్లో పెట్టుకున్నప్పుడు చాలా సౌండ్ వస్తుంటుంది.వాటిని ఆన్ చేసుకోగానే నిద్ర మాట అటుంచితే వచ్చే నిద్ర కూడా పోతుంది.

 Xiaomi Is The Latest Smart Fan Amazing Features , Xiaomi,  New Technology,fan, T-TeluguStop.com

ఫ్యాన్ పాతది అయ్యే కొద్దీ ఈ సమస్య ఉంటుంది.మరో వైపు ఫ్యాన్ ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది.

ప్రస్తుతం టెక్నాలజీ అంతా బాగా అభివృద్ధి చెందింది.కాలు కదపకుండా ఏ పనైనా చేసుకునే సౌలభ్యం ఏర్పడింది.

ఇదే క్రమంలో ప్రముఖ చైనా కంపెనీ షావోమీ ఓ సరికొత్త ఫ్యాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది.ఉన్న చోటు నుంచి ఏ మాత్రం కదలకుండానే దానిని మనం ఆపరేట్ చేయొచ్చు.

ఏ మాత్రం సౌండ్ చేయకుండా చక్కగా గాలిని అందిస్తుంది.ఇంకా ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో యాపిల్, శామ్‌సంగ్ వంటి కంపెనీలకు షావోమీ కంపెనీ ధీటుగా పని చేస్తోంది.

అందుబాటు ధరలకే అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.ఈ తరుణంలో ఓ అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఫ్యాన్‌ను షావోమీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.దీని ధర రూ.6999గా నిర్ణయించింది.అయితే ప్రత్యేక సేల్‌లో భాగంగా దీనిని రూ.5999కే అందిస్తోంది.ఆఫర్ జులై 18 వరకే ఉంది.ఈ ఫ్యాన్‌కు గూగుల్ వాయిస్ అసిస్టెంట్, అలెక్సా సదుపాయం ఉంది.దీంతో మనం చెప్పగానే, కేవలం నోటిమాటతోనే దీనిని ఆపరేట్ చేయొచ్చు.ఎక్కువ కాలం మన్నిక లభించేలా దీని మోటార్‌ని అల్యూమినియంతో కాకుండా కాపర్‌తో రూపొందించారు.

అంతేకాకుండా స్పీడ్ లెవెల్స్‌ 100 వరకు మనం ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం.

ఇప్పుడే ఈ అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఫ్యాన్‌ను ఆఫర్‌లో సొంతం చేసుకోండి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube