పిల్లల చిన్ని చిన్ని కోర్కెలు తీర్చి గిన్నిస్‌ రికార్డులకెక్కిన WWE ‘జాన్‌ సెనా’.. అభినందించకుండా ఉండలేం!

జాన్‌ సెనా… WWE షో ఫాలో అవుతున్న వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.ఈయన అంటే పిల్లలు పడి చస్తారు.

 Wwe Wrestler John Cena Guinness Record By Fulfilling The Wishes Of Children-TeluguStop.com

రింగ్‌లో ప్రత్యర్థులను రఫ్పాడించే జాన్‌ సెనా.చిన్న పిల్లలు అంటే యెనలేని ప్రేమ చూపిస్తాడు.

అవసరం ఉన్నపుడు ఆ ప్రేమను రకరకాలుగా ప్రదర్శిస్తుంటారు.ఇదే ఆయన్ని ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది.

 Wwe Wrestler John Cena Guinness Record By Fulfilling The Wishes Of Children-ప-TeluguStop.com

అవును, తాజగా అత్యధిక మంది పిల్లల కోర్కెలు తీర్చిన రెస్లర్‌గా గిన్నిస్‌ రికార్డుకు ఎక్కేలా చేసింది.విషయం ఏంటంటే.

అమెరికాకు చెందిన రెస్లర్‌ జాన్‌ సెనా 2002నుంచి ‘మేక్‌ ఏ విష్‌’ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే పిల్లల కోర్కెలను తీరుస్తూ వస్తున్నారు.

తనను కలవాలనుకునే.సరదాగా కాసేపు గడపాలనుకునే పిల్లలను ఎంతో ప్రేమతో ఆయన దగ్గరకు తీసుకుంటారు.ఇప్పటి వరకు దాదాపు 650 మంది పిల్లల కోర్కెల్ని ఆయన తీర్చారు.2.5నుంచి 18 సంత్సరాలు కలిగిన వారు ఆ జాబితాలో ఉన్నారు.ఇలా ఏ రెస్లర్‌ ఇప్పటి వరకు చేయలేదు.

ఎవ్వరూ కూడా 200లకు మించి ఎక్కువ కోర్కెలను తీర్చలేకపోయారు.కానీ, జాన్‌ సెనా ఏకంగా 650 మంది పిల్లల కోర్కెల్ని తీర్చాడు.

దీంతో ఆయనకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో స్థానం దక్కింది.

Telugu Wishes, Gunnis, Kidsz Latest, Latest, Wwewrestler-Latest News - Telugu

గతంలో ‘మేక్ ఏ విష్‌’’లో భాగం కావటంపై జాన్‌ సెనా మాట్లాడుతూ.“ఎంత బిజీలో ఉన్నా సరే, నా అవసరం ఉన్నపుడు నేను మీ దగ్గర ఉంటా.ఎందుకంటే ఇది నాకు ఎంతో ఇష్టమైన పని.ఆ అద్భుతమైన క్షణాల కోసం ఏమైనా చేస్తా.పిల్లలకు సాయం చేయడానికి ఎప్పుడూ ముందు వరుసలో ఉండాలనుకుంటా” అని పేర్కొన్నాడు.

కాగా, జాన్ సెనా 1999లో WWE షోలోకి అడుగుపెట్టాడు.రెస్లర్‌గా మారిన రెండు సంవత్సరాలనుంచే మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌తో పనిచేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube