కరోనా వైరస్ పై మాకేపాపం తెలియదు... వూహాన్ వైరాలజీ ల్యాబ్ వివరణ

కరోనా మహమ్మారిలా మారి ప్రపంచ దేశాలకి విస్తరించింది.చైనాలో వూహాన్ లో పుట్టిన ఆ వైరస్ బారిన చైనాలో ఆ ఒక్క నగరం మాత్రమే పడింది.

 Wuhan Virology Lab Chief Denies Covid-19 Originated From Institute, China, Coron-TeluguStop.com

అయితే అక్కడ పుట్టిన వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించేసి అన్ని దేశాలని అతలాకుతలం చేస్తుంది.ఆర్ధిక వ్యవస్థలు కూలిపోయేలా చేస్తుంది.

అన్ని దేశాలలో సుమారు అన్ని రాష్ట్రాలని తాకిన ఈ వైరస్ చైనాలో మాత్రం వూహాన్ నగరం దాటి బయటకి వెళ్లకపోవడం వెనుక ప్రపంచం అంతా ఆశ్చర్యం, మరో వైపు అనుమానం వ్యక్తం చేస్తూ చైనా వైపు చూస్తుంది.ప్రపంచ ఆధిపత్యం కోసం చైనా చేస్తున్న బయోవార్ లో భాగమే కరోనా వైరస్ అని చాలా మంది నమ్ముతున్నారు.

అగ్రరాజ్యం అమెరికా కూడా బలంగా విశ్వసిస్తుంది.అయితే చైనా మాత్రం ఈ కరోనా వైరస్ తమ దేశంలో పుట్టిన తాము కావాలని ప్రయోగించింది కాదని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది.

అయితే చైనా ఈ విషయాన్ని కేవలం మాటల్లో సరిపెడుతుంది.అయితే ఇది చైనా సృష్టి అని చెప్పడానికి ఇతర దేశాల వాళ్ళు ఆధారాలు చూపిస్తున్నారు.తాజాగా నోబెల్ అవార్డు గ్రహీత ఓ చానల్ ఇంటర్వ్యూలో కరోనా వైరస్ సృష్టి జరిగింది వూహాన్ లో వైరాలజీ ల్యాబ్ లోనే అని చెబుతున్నారు.అక్కడ ఎయిడ్స్ మందు కోసం చేస్తున్న ప్రయోగాలలో ఈ వైరస్ పుట్టింది అని, అక్కడి నుంచి బయటకి వచ్చి ఇప్పుడు ప్రపంచ దేశాలని ప్రమాదంలోకి నెట్టేసింది అంటూ బలంగా చెబుతున్నారు.

ఈ ఇంటర్వ్యూ వీడియోని ట్రంప్ కూడా షేర్ చేస్తూ ఇచి చైనా పని అని ఆధారాలు దొరికితే తరువాత పరిణామాలు వేరుగా ఉంటాయని హెచ్చ్ధరించారు.ఈ విషయంలో వుహాన్ వైరాలజీ ల్యాబ్ డైరెక్టర్ వుహాన్ జిమింగ్ స్పందించారు.

తమ ల్యాబ్ అత్యంత భద్రమైనదని, ఇక్కడ వైరస్ పుట్టి, ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశాలే లేవని తమపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు.మా ల్యాబ్ నుంచి ఇలాంటి వైరస్ లు వ్యాప్తి చెందే అవకాశమే లేదు.

మా సిబ్బందిలో ఎవరూ ఈ వైరస్ బారినపడలేదు.ఈ వైరస్ కి మా ల్యాబ్ కారణమని జరుగుతున్నా ప్రచారం అవాస్తవం అని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube