అపార్ట్‌మెంట్‌లో ఎవరూ లేరు రక్షించండి: వుహాన్‌లో చిక్కుకుపోయిన భారతీయ జంట

కరోనా మహమ్మారి పుట్టిన వుహన్‌లో చిక్కుకుపోయిన ఓ భారతీయ జంట తమను రక్షించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరుతోంది.అశిష్ యాదవ్ వుహాన్ టెక్స్‌టైల్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, అతని భార్య నేహా పీహెచ్‌డీ స్కాలర్.

 Wuhan Indian Couple Seeks Government Help Through Video-TeluguStop.com

ఫిబ్రవరి ప్రారంభంలో వుహాన్‌తో పాటు చైనాలో చిక్కుకుపోయిన 600 మంది భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం రెండు ఎయిరిండియా విమానాలను పంపింది.అయితే అదే సమయంలో నేహాకు సర్జరీ వుండటంతో భారత్‌కు రాలేకపోయారు.

అయితే చైనాలో ఇప్పటికే కరోనా బారినపడి 1,700 మందికి పైగా మరణించడం, వేల సంఖ్యలో ఆసుపత్రి పాలవ్వడంతో ఆశిష్ దంపతులు భయభ్రాంతులకు గురవుతున్నారు.వుహాన్ నగరం దాదాపు ఎడారిగా, దెయ్యాల నగరంగా మారిపోయిందని.

నిత్యం వేలాదిమందితో కళకళలాడే తమ యూనివర్సిటీ ఖాళీ అయ్యిందని వారు భారత ప్రభుత్వానికి పెట్టిన వీడియో మేసేజ్‌లో గోడు వెళ్లబోసుకున్నారు.

Telugu Corona, Indian, Nri Telugu Nri, Wuhan, Wuhan Indian-Telugu NRI

అంతేకాకుండా తాము నివసించే అపార్ట్‌మెంట్‌లో మేమిద్దరం తప్ప ఎవరూ లేరని, నిత్యావసర వస్తువులు కూడా లేవని ఆశిష్ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తాగేందుకు మంచినీళ్లు కూడా లేవని, నీళ్లు కావాలని అడిగితే అధికారులు కొన్ని నీళ్లు ఇచ్చారంటూ ఫ్రీజ్‌లో ఖాళీ బాటిల్స్‌ను చూపించారు.వీలైనంత త్వరగా తమను భారత్‌కు తీసుకెళ్లమంటూ వారిద్దరూ ఆశిష్-నేహా కోరారు.

మరోవైపు ఈ వారం తర్వాత వుహాన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక విమానం పంపిస్తామని, అందులో రావాలనుకునే భారతీయులు తమను సంప్రదించాలంటూ భారత విదేశాంగ శాఖ ట్వీట్లు చేసింది.

Telugu Corona, Indian, Nri Telugu Nri, Wuhan, Wuhan Indian-Telugu NRI

కాగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్యలో చైనాలో సోమవారం నాటికి 1,800 దాటింది.వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న హుబెయ్ ప్రావిన్స్‌లో సోమవారం 93 మంది మరణించారు.కొత్తగా 1,807 కొత్త కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 72,300 తాకింది.

భారత్‌లోని మహారాష్ట్రలో 64 మంది కరోనా అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించగా.నెగిటివ్ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

వీరందరినీ ఇళ్లకు పంపారు.అయితే మరో ఐదుగురిని మాత్రం ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube