సూపులో చచ్చిన గబ్బిలం.. బెదిరిపోయి ఏం చేశారంటే?

చైనా దేశంలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ఆ దేశంలోని ప్రజలను గజగజా వణికిస్తోంది.కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా వైరస్ పేరు వింటే అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

 Wuhan Family,  Hospital, Coronavirus, Dead Bat, Soup-TeluguStop.com

తాజాగా జరిగిన ఒక ఘటన చైనీయుల్లో కరోనాపై నెలకొన్న భయానికి సాక్ష్యంగా నిలిచింది.కరోనా వైరస్ ఏ జంతువు నుంచి వ్యాప్తి చెందిందో స్పష్టమైన ఆధారాలు లేకపోయినా గబ్బిలం నుంచి వైరస్ వ్యాపించి ఉండవచ్చని పలువురు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

కరోనా వైరస్ విజృంభణ అనంతరం చైనాలో గబ్బిలాలను తినడానికి అక్కడి ప్రజలు ఆసక్తి చూపడం లేదు.తాజాగా వుహాన్ కు చెందిన చెన్ అనే వ్యక్తి పంది మాంసంతో చేసిన సూప్ ను రెస్టారెంట్ నుంచి కొనుగోలు చేశాడు.

ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులలో ఒకరు ఆ సూప్ ను తాగారు.అనంతరం ఆ సూప్ లో గబ్బిలం కనిపించడంతో కరోనా సోకి ఉంటుందేమో అనే భయంతో సూప్ తాగిన వ్యక్తి ఆస్పత్రికి పరుగులు తీశాడు.

ఒకప్పుడు చైనీయులు గబ్బిలాలను ఎంతో ఇష్టంగా తినేవాళ్లు.అయితే కరోనా వైరస్ విజృంభణ తరువాత వాటికి దూరంగా ఉంటున్నారు.

చెన్ సూప్ గురించి మాట్లాడుతూ మొదటిరోజు నాన్న పంది మాంసం సూప్ ను తాగిన తరువాత ఫ్రిజ్ లో పెట్టామని….మూడు రోజుల తర్వాత సూప్ ను వేడి చేసే సమయంలో ఏదో జంతువు కదులుతున్నట్టు తేలడంతో పరీక్షించగా ఆ జంతువు గబ్బిలం అని గుర్తించామని చెప్పారు.

రెస్టారెంట్ ఓనర్ ను గబ్బిలంగురించి నిలదీయగా సూప్ కు చెల్లించిన డబ్బును రీఫండ్ చేశాడని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube