శ్యామ్ సింగరాయ్ కథ విన్న వెంటనే ఓకే చెప్పారు: రచయిత

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్.ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీ క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 Writer Satyadev Janga About Shyam Singha Roy Movie Writer, Satyadev, Shyam Singh-TeluguStop.com

విడుదలకు ఒక రోజు వుండటంతో పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు.ఈ సందర్భంగా ఈ సినిమాకు కథను అందించిన రచయిత సత్యదేవ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు.

ఈ సందర్భంగా సత్యదేవ్ మాట్లాడుతూ శ్యామ్ సింగరాయ్ సినిమా ఒక వినూత్నమైన కథాంశం.ఈ సినిమా స్టోరీ చెప్పగానే నాని ఒక్క మాట కూడా మాట్లాడకుండా సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.

ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్స్ లో మనకు కనిపిస్తారు.ఈ సినిమా కథ చెప్పగానే నిర్మాత వెంకట్ బోయినపల్లి కూడా వెంటనే ఒప్పుకొని ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.

Telugu Satyadev, Tollywood, Writer-Movie

ఒక అద్భుతమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నందుకు దర్శకుడు రాహుల్ నిర్మాత బోయినపల్లి కి రచయిత సత్యదేవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఇక ఈయన మాట్లాడుతూ త్వరలోనే మరొక హార్రర్, థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని ఇప్పటికే ఒక ప్రముఖ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించడానికి ఒప్పుకుందని త్వరలోనే ఈ విషయాలన్నింటినీ అధికారకంగా వెల్లడిస్తామని ఈ సందర్భంగా మాట్లాడారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube