రంజితకు నేను ఆ రోజే బుద్ది చెప్పి ఉంటే బాగుండేదన్న పరుచూరి  

నిత్యానంద స్వామితో రంజిత రాసలీలలు వీడియో ఏ స్థాయిలో ఫేమస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.రంజిత గతంలో హీరోయిన్‌గా చాలా సినిమాల్లో నటించింది.

TeluguStop.com - Writer Parachuri Gopala Krishna Ranjitha Nithyananda

ఆ సమయంలో అయినా ఇంత ఫేమస్‌ అయ్యిందో లేదో తెలియదు కాని ఆ వీడియో ఎప్పుడైతే లీక్‌ అయ్యిందో అప్పుడు రంజిత ఎక్కడికో వెళ్లి పోయింది.ఆమె గురించి చిన్న వారి నుండి పెద్ద వారి వరకు అందరికి తెల్సిందే.

కేవలం తెలుగు రాష్ట్రాలు తమిళనాడు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఆమె వీడియోలపై చర్చలు జరిగాయి.

ఆ వీడియోలు లీక్‌ అవ్వడంతో ఆమె కెరీర్‌ కూడా నాశనం అయ్యింది.హీరోయిన్‌గా మంచి పేరు దక్కించుకున్న రంజిత ప్రస్తుతం సీనియర్‌ హీరోయిన్‌గా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమాలు చేసేది.కాని ఇప్పుడు ఆమెను పట్టించుకునే వారే లేరు.

అసలు ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది అనేది ఎవరికి తెలియదు.ఈ సమయంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ రంజిత గురించి ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.

ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి.

ఆయన మాట్లాడుతూ.నా కూతురు స్నేహితురాలు రంజిత.అందంగా ఉంది హీరోయిన్‌ అయ్యే ఫీచర్స్‌ ఉన్నాయని నేను హీరోయిన్‌గా పరిచయం చేయించాను.

ఆ తర్వాత తమిళంలో మంచి హీరోయిన్‌గా పేరు దక్కించుకుంది.హీరోయిన్‌గా మంచి స్థాయిలో ఉన్న సమయంలోనే నిత్యానంద భక్తి మైకంలో ఆమె మునిగి పోయింది.

ఒకసారి నన్ను కలిసిన సందర్బంగా నిత్యానంద గొప్పతనం చెబుతూ ఆయన బుక్‌ ఇచ్చేందుకు ప్రయత్నించింది.కాని నేను వాటిని నమ్మను, నాకు అవసరం లేదు అన్నాను.

ఆ సమయంలోనే నువ్వు కూడా అలాంటి వారిని నమ్మకు అంటూ గట్టిగా బుద్ది చెప్పి ఉంటే, ఆమె నా పై గౌరవంతో అతడికి దూరంగా ఉండేది.ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అంటూ పరుచూరి అన్నాడు.

#Ranjitha #TeluguViral #ViralIn #ParachuriGopala #Nithyananda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు