ఈ రచయిత త్రివిక్రమ్ ను అరేయ్ ఒరేయ్ అనేవారట.. అసలేం జరిగిందంటే?

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మాటల మాంత్రికుడిగా ఇండస్ట్రీలో పేరున్న సంగతి తెలిసిందే.అరవింద సమేత, అల వైకుంఠపురములో విజయాలతో స్టార్ డైరెక్టర్ గా తన రేంజ్ ను పెంచుకున్న త్రివిక్రమ్ పలు సినిమాలకు మాటలు కూడా అందిస్తున్నారు.

 Writer Nivas Comments About Director Trivikram Srinivas-TeluguStop.com

త్వరలో మహేష్ తో ఒక సినిమాను తెరకెక్కించనున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి రచయిత నివాస్ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తనకు అరేయ్ ఒరేయ్ అనుకునే రిలేషన్ ఉండేదని ఇప్పటికి కూడా ఆ రిలేషన్ కొనసాగుతోందని నివాస్ వెల్లడించారు.

 Writer Nivas Comments About Director Trivikram Srinivas-ఈ రచయిత త్రివిక్రమ్ ను అరేయ్ ఒరేయ్ అనేవారట.. అసలేం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

త్రివిక్రమ్ రచయిత, తను రచయిత అని ఒక వెర్షన్ రాయమని తనను నేను అడగలేనని నివాస్ పేర్కొన్నారు.కొరటాల శివ తనను అన్నయ్య అని పిలుస్తారని నివాస్ చెప్పుకొచ్చారు.

తాను సినిమాలకు పని చేస్తామంటే దర్శకులు రాయించుకుంటారని అయితే తనకు సొంతంగా సినిమాలు ఉన్నాయని నివాస్ తెలిపారు.

తన స్నేహితులు కూడా రచయితలు కావడంతో అవకాశాలు అడగలేనని నివాస్ పేర్కొన్నారు.

ఇండస్ట్రీలో రికమెండేషన్ లు పని చేయవని ప్రతిభ ఉన్నవాళ్లనే తాను అయినా ప్రోత్సహిస్తానని నివాస్ చెప్పుకొచ్చారు.బోయపాటి శ్రీను తాను రూమ్ మేట్స్ అని భద్ర, తులసి, సింహా సినిమాలకు తాను పని చేశానని నివాస్ పేర్కొన్నారు.

భద్ర సినిమాకు స్క్రిప్ట్ పనులు తాము కూడా చేసినా కొరటాల శివకు గుర్తింపు రావాలని భావించి భద్ర సినిమాకు ఆయన పేరు వేయించామని నివాస్ వెల్లడించారు.

Telugu Comments, Interesting Facts, Nivas, Trivikram Srinivas, Writer Nivas Comments About Director Trivikram Srinivas-Movie

సింహా తరువాత తనకు వేరే సినిమాలలో ఆఫర్లు రావడంతో బోయపాటి శ్రీనుకు తాను దూరమయ్యానని నివాస్ పేర్కొన్నారు.కొరటాల శివతో తాను కలిసి పని చేస్తానన్నా ఆయన తనను వద్దనరని నివాస్ పేర్కొన్నారు.కొరటాల శివ తరువాత సినిమా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

#WriterNivas #Nivas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు