కోహ్లీపై రచయిత్రి ట్వీట్.. కొత్త యాంగిల్ అదిరిందట!  

Writer Bhaavna Arora Tweet On Virat Kohli - Telugu Anushka Sharma, Bhaavna Arora, Sports News, Virat Kohli

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రముఖ రచయిత్రి భావనా అరోరా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

Writer Bhaavna Arora Tweet On Virat Kohli

ఈ సందర్భంగా విరాట్ కోహ్లీపై ప్రముఖ రచయిత్రి భావనా అరోరా ఓ ట్వీట్ చేసింది.

తొలి వన్డేలో నాలుగో పొజిషన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ కేవలం 16 పరుగులకే ఔట్ అయ్యాడు.

దీంతో భావనా అరోరా విరాట్ పొజిషన్‌ను ప్రస్తావిస్తూ ‘అనుష్క శర్మ విరాట్ కోహ్లీపై చాలా ఆగ్రహంగా ఉన్నట్లుంది.ఆస్ట్రేలియన్లతో కొత్త యాంగిల్స్ ట్రై చేస్తున్న కోహ్లీ ఆమె దగ్గర కుడా ఇలాంటి యాంగిల్స్ ట్రై చేసి ఉండడు’ అంటూ ఆమె ట్వీట్ చేసింది.

ఇలాంటి బూతు ట్వీట్‌ను ఆమె ఎలా పోస్ట్ చేసిందంటూ కోహ్లీ ఫ్యాన్స్ ఆమెను చెడుగుడు ఆడుకుంటున్నారు.

విరాట్‌ను తిట్టాలని ఉంటే ఆయన పేరుతో చేయాలి తప్ప మధ్యలోకి అనుష్క పేరు ఎందుకు లాగిందంటూ భావనా అరోరాకు క్లాస్ పీకుతున్నారు నెటిజన్లు.

ఇక భావనా భర్తన ఉద్దేశించి కోహ్లీ ఫ్యాన్స్ చేస్తున్న బూతు కామెంట్లతో ఆమె మైండ్ బ్లాక్ అవుతుందట.ఏదేమైనా ప్రస్తుతం ఈ ఒక్క ట్వీట్‌తో సోషల్ మీడియాలో సదరు రచయిత్రి దుమారం లేపింది.

తాజా వార్తలు