ఢిల్లీలో రెజ్లర్లు నిర్వహిస్తున్న ఆందోళనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో రెజ్లర్లు సమావేశం అయ్యారు.
రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ లను మంత్రి అనురాగ్ ఠాకూర్ చర్చలకు ఆహ్వనించారు.దీనిపై సానుకూలంగా స్పందించిన రెజ్లర్లు ఆయన నివాసంలో సమావేశం అయ్యారని తెలుస్తోంది.
అయితే మహిళా రెజ్లర్లపై డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆయనను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.