బీజేపీ లో చేరిన ఫోగట్ ఫ్యామిలీ!  

Wrestler Babita Phogat And Mahavir Phogat Joins In Bjp Party-

ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం తో ఒక్కొక్కరుగా ఆ పార్టీ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో చాలా మంది బీజేపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు కూడా. అయితే తాజాగా కామన్ వెల్త్ ఛాంపియన్ బబితా ఫోగట్ కూడా ఆ బీజేపీ లో చేరినట్లు తెలుస్తుంది..

బీజేపీ లో చేరిన ఫోగట్ ఫ్యామిలీ!-Wrestler Babita Phogat And Mahavir Phogat Joins In BJP Party

కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజు సమక్షంలో బబితా తో పాటు ఆమె తండ్రి మహావీర్ ఫోగట్ కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకున్నట్లు తెలుస్తుంది. మ‌రో రెండు నెలల్లో హ‌ర్యానాలో ఎన్నిక‌ల జ‌ర‌గ‌నున్న ఈ త‌రుణంలో ఫోగ‌ట్ ఫ్యామిలీ బీజేపీలో చేర‌డం అనేది ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. 2016 లో అమీర్ ఖాన్ మహావీర్ ఫోగట్ పాత్రలో అలరించిన దంగల్ చిత్రం తరువాత ఫోగట్ కుటుంబం మరింత పాపులర్ అయ్యింది.

అయితే ఒకరకంగా హర్యానా లో పాపులారిటీ ఉన్న ఆ కుటుంబం లోని ఇద్దరు వ్యక్తులు బీజేపీ పార్టీలో చేరడం ఆ పార్టీ కి అనుకూలాంశంగా చెప్పొచ్చు. అయితే మోదీ చేప‌ట్టిన విధానాలు, స్కీమ్‌లు త‌మ‌ను ఆక‌ట్టుకున్న‌ట్లు మ‌హావీర్ పోగ‌ట్ చెప్పారు.