రెజ్లర్ సతీందర్ మాలిక్‌పై జీవితకాల నిషేధం.. ఎందుకో తెలుసా?

రాజధాని న్యూఢిల్లీలో బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ 2022 కోసం ట్రయల్స్ నిర్వహిస్తు్న్నారు.కేడీ జాదవ్ స్టేడియంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో మంగళవారం పురుష రెజ్లర్లు పాల్గొన్నారు.

 Wrestler Satinder Malik Banned For Life , Latest News , Sports Update , Birmin-TeluguStop.com

అయితే, జాతీయ ట్రయల్స్‌లో మునుపెన్నడూ చోటుచేసుకోని విధంగా.ఓ రెజ్లర్‌ రిఫరీపై పిడిగుద్దల వర్షం కురిపించాడు.

భారత రెజ్లింగ్‌ సమాఖ్య నుంచి జీవితకాల నిషేధానికి గురయ్యాడు.భారత రెజ్లింగ్‌లో చోటుచేసుకున్న అనూహ్య ఘటన క్రీడా వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

సర్వీసెస్‌ రెజ్లర్‌ సతీందర్‌ మాలిక్‌ (ఎయిర్‌ఫోర్స్) 125 కేజీల విభాగంలో పోటీలోకి దిగాడు.ఒక సీనియర్ రిఫరీతో అనుచితంగా ప్రవర్తించాడు.బౌట్‌ మరో 18 సెకండ్లలో ముగియనుండగా సతీందర్‌ మాలిక్‌ 3-0తో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.ప్రత్యర్థి రెజ్లిర్‌ మోహిత్‌ ప్రభావశీల ‘టేక్‌డౌన్‌’ సహా సతీందర్‌ మాలిక్‌ను మ్యాట్‌ మీద నుంచి కిందకు నెట్టాడు.

టేక్‌ డౌన్‌కు రెండు పాయింట్లు ఇవ్వని రిఫరీ వీరెందర్‌ మాలిక్‌.పుష్‌ఔట్‌కు ఓ పాయింట్‌ను మాత్రమే కేటాయించాడు.

దీంతో మోహిత్‌ ఆన్‌ మ్యాట్‌ రిఫరీ నిర్ణయాన్ని సవాల్‌ చేశాడు.జ్యూరి రిఫరీ సత్యదేవ్‌ మాలిక్‌ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.

సతీందర్‌ మాలిక్‌, సత్యదేవ్‌ మాలిక్‌లది ఒకే గ్రామం కావటంతో అతడు జ్యూరి నిర్ణయానికి దూరంగా ఉన్నాడు.మరో సీనియర్‌ రిఫరీ జగ్బిర్‌ సింగ్‌ను మోహిత్‌ సవాల్‌పై నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరాడు.

Telugu Latest, Satinder Malik, Satyadev Malik, India-Latest News - Telugu

టీవీ రిప్లేలు పరిశీలించిన జగ్బిర్‌ సింగ్‌.మోహిత్‌కు మూడు పాయింట్లు ప్రకటించాడు.దీంతో స్కోరు 3-3తో సమమైంది.స్కోర్లు సమం కావటంతో బౌట్‌లో చివరి పాయింట్‌ సాధించిన రెజ్లిర్‌ మోహిత్‌ను విజేతగా ప్రకటించారు.పక్క మ్యాట్‌లో ఒలింపిక్‌ హీరో రవి దహియ, ఆమన్‌లు 57 కేజీల విభాగంలో పోటీపడుతుండగా.వారిని దాటుకుంటూ వెళ్లిన సతీందర్‌ మాలిక్‌ నేరుగా రిఫరీ దగ్గరకు వెళ్లాడు.

మ్యాచ్ నిర్ణయం అతనికి వ్యతిరేకంగా రావడంతో అతనిని కొట్టాడు.ఈ చర్యతో రెజ్లింగ్ సమాఖ్య కూడా చాలా షాక్ అయ్యింది.

సమాఖ్య వెంటనే గట్టి చర్య తీసుకుంది.సతేందర్‌ను జీవితకాలం నిషేధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube