వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రియా మాలిక్ పసిడి కైవసం..!

ప్రముఖ రెజ్లర్ ప్రియా మాలిక్ భారత దేశానికి గర్వకారణంగా నిలిచింది.ప్రసిద్ధ వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె గోల్డ్ మెడల్ గెలుచుకుంది.

 Wrestler Priya Malik Wins Gold Medal In World Cadet Wrestling Championship-TeluguStop.com

తాజాగా హంగేరీలో జరిగిన రెజ్లింగ్ పోటీల్లో 73 కేజీల విభాగంలో ఆమె తన సత్తా చాటింది.ఫైనల్‌ రౌండ్ లో ఘన విజయం సాధించి పసిడి కైవసం చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చింది.

ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో మీరాభాయ్ రజత పతకం గెలిచి భారతీయులను గర్వంగా ఫీల్ అయ్యేలా చేశారు.అయితే ఆమె అద్భుతమైన గెలుపు ను సెలబ్రేట్ చేసుకుంటున్న క్రమంలోనే మరో ప్రపంచ క్రీడా వేదికపై ప్రియా మాలిక్ విజయం సాధించి వావ్ అనిపించింది.

 Wrestler Priya Malik Wins Gold Medal In World Cadet Wrestling Championship-వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రియా మాలిక్ పసిడి కైవసం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ రెండు అంతర్జాతీయ విజయాలతో ప్రస్తుతం భారత క్రీడా ప్రియులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.దేశవ్యాప్తంగా ప్రియా మాలిక్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.భవిష్యత్తులో కూడా మరెన్నో పతకాలను కైవసం చేసుకోవాలని విష్ చేస్తున్నారు.

Telugu Bags, Bhajarang Puniya, Breaking News, Gold Medel, Latest Update, Olmpics2020, Priya Malik, Ravi Kumar Dahiya, Tokyo Olympics, World Cadet Wrestling Championship-Latest News - Telugu

ఇక టోక్యో ఒలింపిక్స్‌లో జరగనున్న రెజ్లింగ్ పోటీలలో కూడా భారత అథ్లెట్ లు తలపడనున్నారు.ఈ రెజ్లర్లపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా పోటీ చేస్తుండగా.65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా పోటీ చేస్తున్నాడు.ఇక 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

అయితే మహిళా విభాగంలో సీమా, వినేశ్ ఫోగర్, అన్షు, సోనమ్ రెజ్లర్లు పోటీ చేయనున్నారు.

#Olm #Tokyo Olym #Bags #Gold Medel #Priya Malik

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు