ఈ ఆలయంలో చెప్పుల దండలు అర్పిస్తారట... ఎందుకో తెలిస్తే?

భారత దేశం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఎంతో ప్రత్యేకం.ఎందుకంటే భిన్నమైన సంస్కృతులకు ప్రతీక మన భారతదేశం.

 Wreaths Of Sandals Are Offered In This Temple ... If You Know Why Viral News, Vi-TeluguStop.com

అయితే మన దేశంలోని చాలా ఆలయాలలో చాలా ఆచారాలు ఉన్నాయి.అయితే ఇప్పుడు ఒక ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది.

అయితే ఓ ఆలయంలో ఉన్న వింత ఆచారం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఏదైనా ఆలయంలో బట్టలు సమర్పించడం షరా మామూలే.

కాని కర్ణాటక రాష్ట్రం లోని గుల్ బర్గా జిల్లాలోని లక్కమ్మ దేవాలయంలో భక్తులు మొక్కు బడిగా చెప్పుల దండలను సమర్పిస్తారట.సాధారణంగా ఆలయంలోకి చెప్పులను ధరించి వెళ్లటమే పెద్ద అపచారంగా చూస్తారు.

ఎందుకంటే శుద్ధిగా ఆలయ ప్రాంగణలోకి అడుగు పెట్టాలనే ఉద్దేశ్యంతో ఈ రకమైన ఆచారాన్ని పూర్వీకులు నెలకొల్పారు.

  దీపావళి పండగ రోజున భక్తులు ఈ ఆలయంలో చెప్పుల దండలను సమర్పిస్తారు.ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

వినడానికి చాలా వింతగా ఉన్నా ఇది నిజం.అంతేకాక ఈ ఆలయంలో అమ్మ వారికి మాంసాహారం కూడా సమర్పిస్తారని తెలుస్తోంది.

ఇక ఈ ఆలయంలోని ఈఆ చారం నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.  నెటిజన్లు పెద్ద ఎత్తున తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

  ఇటువంటి వింత ఆచారాలు ఉన్న ఆలయాలను తెలియజేయాలని మరికొందరు కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube