వావ్‌.. నిజంగా సింహం ఠీవీగా నిల్చుంటే ఇలాగే ఉంటుందేమో..!

అడవికి రారాజుగా పిలవబడే సింహమంటే దాదాపుగా ప్రతీ ఒక్కరికి చాలా ఇష్టం.ఉంటే సింహంలా ఉండాలని, శత్రువులను సింహం మాదిరిగా వేటాడాలని పెద్దలు చెప్తుండటం మనం వింటుంటాం.

 Wow Would It Really Be Like If The Lion Stood Stiff , , Lion, Stunning Look, Gig-TeluguStop.com

వారు అలా సింహం గురించి గొప్పగా చెప్తుండటం వల్ల పిల్లలు కూడా సింహం అంటే గొప్పదని నమ్ముతుంటారు.సింహాన్ని ఒక్కసారి అయినా లైవ్‌గా చూడాలని ఆశపడుతుంటారు.

ఇకపోతే జూలో గంభీరంగా నిలబడే సింహాన్ని చూసి చాలా ఆనందపడిపోతుంటారు.అయితే, అందరికీ లయన్‌ను లైవ్‌గా చూసే అవకాశం దొరకకపోవచ్చు.

కానీ, నేటి నెట్ వరల్డ్‌లో ప్రతీ ఒక్కరు సింహం స్టిల్స్ లైవ్‌వి చూడొచ్చు.అలాంటి స్టిల్ ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

దానిని ఎవరు క్లిక్ మనిపించారంటే.

దక్షిణాఫ్రికాలోని జీజీ కన్జర్వేషన్ వైల్డ్ లైఫ్ రిజర్వులో ఠీవిగా నిల్చుని ఉన్న సింహం లైవ్ ఫొటోను సిమోన్‌నీహాం అనే ఫొటోగ్రాఫర్‌ క్లిక్ మనిపించాడు.

సింహాన్ని అడవికి రారాజు ఎందుకు అంటారో ఈ ఫొటో చూస్తే అర్థమవుతుందనే క్యాప్షన్ జత చేస్తూ అతడు ఆ ఫొటోను నెట్టింట షేర్ చేశాడు.ఆ ఫొటో చూసి నెటిజనాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హాలీవుడ్ మూవీస్‌లో ఉండే లయన్ కింగ్‌‌లా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.కేవలం 30 అడుగుల దూరం నుంచే లయన్‌ను తన కెమెరాతో క్యాప్చర్ చేసినట్లు ఫొటోగ్రాఫర్ తెలిపాడు.

ఇక చాలా మంది ఫొటో చూసి రకరకాల పోస్టులు, కామెంట్లు చేస్తూ లైక్స్ కొడుతున్నారు.మృగరాజు తన సామ్రాజ్యాన్ని ఠీవిగా, గంభీరంగా రక్షించుకుంటుందంటూ పలువురు పేర్కొంటున్నారు.

ఎముకల కొండపై ఠీవిగా నిల్చొని ఉన్న స్టిల్ చూసి లయన్ ది గ్రేట్.రియలిస్ట్ స్టిల్ అంటూ కామెంట్లు చాలా వచ్చాయి.

ఇలాంటి అరుదైన ఫొటో అందించినందుకు గాను నెటిజన్లు ఫొటోగ్రాఫర్ సిమోన్‌ను మెచ్చుకుంటున్నారు.అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అయితే, ఫొటో‌గ్రాఫర్లు చాలా మంది లయన్స్‌పై ఫొటోలు తీసుకున్నప్పటికీ ఇది ది బెస్ట్ స్టిల్ అని కొందరు నెటిజన్లు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube