వావ్ : కేవలం 19 నిమిషాలలో రూ . 758 కోట్లు పలికిన పెయింటింగ్ ఎక్కడంటే ..?

ప్రపంచ వ్యాప్తంగా పికాసో పెయింటింగ్స్‌కి  చాలా డిమాండ్ ఉంది.ఆయన వేసే పెయింటింగ్స్ చాలా మందిని హత్తుకునేలా ఉంటాయి.

 Wow: Where Is The Rs 758 Crore Painting In Just 19 Minutes?758 Crores, Picasso P-TeluguStop.com

అందుకే వాటిని పోటీపడి మరీ కొనేస్తుంటారు.పికాసో వేసే పెయింటింగ్స్ కొన్ని కోట్లు విలువ చేస్తాయంటే ఆయనకు అభిమానులు ఎంత మంది ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు.

పికాసో 1932లో గీసిన ఓ పెయింటింగ్‌ అద్బుత రికార్డును నెలకొల్పింది.ఏకంగా 758 కోట్ల రూపాయలకు ఆ పెయింటింగ్ అమ్ముడుపోవడం విశేషం.

కరోనా సమయంలో కూడా పెయింటింగ్ ఇటువంటి ధర పలకడంతో రికార్డు నెలకొల్పింది.పెయింటింగ్ లో ​కిటికీ వద్ద అందంగా కూర్చుని ఉన్న యువతి ఫొటో అంత ధర పలకడం చూసి వేలం వేసిన సంస్థే నోరెళ్లబెట్టింది.పికాసో చేతి నుంచి జాలువారిన అద్భుత కళాఖండాల్లో ఒకటైన మేరీ థెరిసె కిటికీ వద్ద కూర్చుని ఉన్న యువతి పెయింటింగ్‌కి భారీ ధర పలికింది.

1932లోఈ పెయింటింగ్‌ పూర్తయ్యింది.అయితే ఆ పెయింటింగ్ ను న్యూయార్క్‌కి చెందిన క్రిస్టైన్స్ సంస్థ గురువారం వేలం వేసింది.బిడ్డింగ్ ప్రారంభమైన కేవలం 19 నిమిషాల్లోనే 103.4 మిలియన్ డాలర్లకు పెయింటింగ్ అమ్ముడుపోవడంతో అందరూ నోరెళ్లబెట్టారు.ఇండియన్ కరెన్సీలో అక్షరాలా 758 కోట్ల రూపాయలకు ఆ పెయింటింగ్ అమ్ముడుపోయింది.

పెయింటింగ్ ధర, వేలం, సంస్థ కమిషన్ అన్నీ కలుపుకుని అంత ధర పలికిందని వేలం సంస్థ ప్రెసిండెంట్ బోనీ బ్రెన్నాన్ తెలిపారు.మొదటగా ఆ పెయింటింగ్ 55 మిలియన్ డాలర్లు ధర పలుకుతుందని భావించామని, అయితే అత్యధికంగా 103.4 మిలియన్ డాలర్లు పలకడంతో ఆశ్చర్యానికి గురైనట్లు వేలం వేసిన సంస్థ నిర్వాహకులు తెలిపారు.దీంతో వంద మిలియన్ డాలర్ల మార్కు దాటిన పికాసో చిత్రాల సంఖ్య ఐదుకి పెరిగింది.

కరోనా టైంలో ఇటువంటి విపత్కర కాలంలోనూ అంత ధర పలకడం విశేషమన ఆర్ట్ మార్కెట్ గాడిన పడిందని వేలం వేసిన క్రిస్టైన్స్ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube