హాలీవుడ్ యాక్షన్ మూవీ సీన్స్ మాములుగా ఉండవు.హీరోలు గాల్లో అలా బైకులు, కార్లు తెగ నడుపుతారు.
ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్ కి జంపింగులు చేస్తారు.ఉన్నట్టుండి బైకులతో షాపింగ్ మాల్స్ లోకి, ఆఫీస్ లలోకి దూసుకెళ్లి మరి విలన్ ను ఛేజ్ చేసి పట్టుకుంటారు కదా.నేను కూడా వారికంటే ఏం తక్కువ అనుకున్నాడేమో గాని ఓ యువకుడు తన బైకుతో అదిరిపోయే స్టంట్ చేసి ‘వారెవ్వా ఏం డ్రైవింగ్ గురూ అనిపించుకున్నాడు.రయ రయ్ అంటూ సరాసరి బైకుతో షాపులోకి దూసుకొచ్చి షాప్ ఓనర్ కి ఝలక్ ఇచ్చాడు.
అసలు విషయం ఏమిటంటే.ఓ వ్యక్తి హాయిగా తన షాపులో కూర్చొని ఫోన్ చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు.అదే సమయంలో ఓ యువకుడు సడెన్ గా తనబైకుతో సహా షాపులోకి దూసుకొచ్చాడు.ఆ సీన్ చూసిన దుకాణదారుడు ఒక్కసారిగా షాక్ అయిపోయాడు.
అదృష్టవశాత్తు ఆ దుకాణదారుడికి బైకు నడిపిన ఆ యువకుడికి ఎలాంటి గాయాలు కాలేదు.దీనికి సంబందించిన వీడియో చాలా రోజుల క్రితమే వచ్చిన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అసలు ఈ వీడియో కావాలని తీశారా ? లేదా సడన్ గా అలా జరిగిపోయిందా అన్నది తెలియదు గాని ఈ వీడియో మాత్రం భలే క్లిక్ అయ్యింది.ఇక ఈ వీడియో చూసిన వారంతా సూపర్, నెక్స్ట్ లెవెల్ డ్రైవింగ్ సూపర్ పార్కింగ్అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
మరికొందరు మాత్రం ప్రాణాలతో చెలగాటమా అన్న రేంజ్ లో క్లాస్ పీకుతున్నారు.ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.మరి మన యాక్షన్ హీరో చేసిన ఈ వీడియోను మీరు చూశారా ? చూడకుంటే ఇటు ఓ లుక్ వెయ్యండి.