వాహ్.. తెలివంటే ఇదే.. మభ్యపెడుతూ తన భారం జింక మీద వేస్తున్న కోతి..

కోతులు సాధారణంగా చేసే పనులు చాలా చిలిపిగా ఉంటాయి.మనుషులు కూడా ఏదేని పనిని కొంచెం కొత్తగానో, వింతగానో చేసినట్లయితే కోతిలాగే చేశావని మనం అంటుంటాం కూడా.

 Wow This Is Clever A Monkey Putting His Burden On A Deer In Camouflage Details, Monkey, Dog, Viral Animals Video, Social Media, Viral Video, Monkey And Deer, Monkey Weight, Clever-TeluguStop.com

అలా అనడం మనకు అలవాటే.కాగా, ఓ కోతి నిజంగానే చాలా తెలివైన పని చేసింది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది.

 Wow This Is Clever A Monkey Putting His Burden On A Deer In Camouflage Details, Monkey, Dog, Viral Animals Video, Social Media, Viral Video, Monkey And Deer, Monkey Weight, Clever -వాహ్.. తెలివంటే ఇదే.. మభ్యపెడుతూ తన భారం జింక మీద వేస్తున్న కోతి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లవ్లీ యానిమల్స్ లవ్లీ.

అనే ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ వేదికగా షేర్ అయిన వీడియోలో కోతి చేసిన తెలివైన పనిని మీరు చూడొచ్చు.ఈ వైరల్ వీడియో చూసి నెటిజన్లు కొందరు వావ్.

అని అంటుండగా, మరి కొందరు నెటిజన్లు తన భారం తానే కోతి మోయలేకపోతున్నదని కామెంట్స్ చేస్తున్నారు.ఇంతకీ సదరు వైరల్ వీడియోలో కోతి ఏం చేసిందంటే.

వీడియోలో కోతి, జింక రెండు ఉన్నాయి.అయితే, అదేదో అడవిలో జింక నడుస్తుండగా, తన మీదకు కోతి ఎక్కేసింది.దాంతో జింక అతి కష్టంగా కోతి బరువును కూడా మోస్తూ ముందుకు సాగింది.ఇంతలో జింకకు అనుమానం వచ్చి తన మీద ఎవరో ఉన్నారనే వెనక్కి తిరిగి చూసింది.

అంతలో తెలివిగా కోతి జింక భుజాల మీద నుంచి ఓ కొమ్మ మీదకు దూకింది.

ఇక మళ్లీ జింక నడిచేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో కొమ్మ మీద నుంచి జింక మీదకు దూకింది.అలా మంకీ తెలివిని ప్రదర్శించి తన బరువును తాను మోసుకోకుండా జింక మీదకు వెళ్లి తన భారాన్ని జింక మీద వేసింది.ఇక ఈ విషయం తెలుసుకోలేని జింక.

తన మీద ఎక్కిన కోతిని గాడిదలాగా మోస్తూనే ఉంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు పాపం జింక అని అంటున్నారు.

తెలివంటే కోతిదేనని మరి కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube