వావ్.. ఈ వైన్ పెయింటింగ్స్ అదుర్స్ కదూ..!

మనకు తెలిసినంత వరకు వైన్ అనగానే తాగడం.తాగి తూలడం చేస్తుంటారు.

 Wine Painting, Viral Post, Viral Latets, Viral News, Social Meida, Viral Photos,-TeluguStop.com

వైన్ తాగితే ఎంత కిక్ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కానీ ఇప్పుడు వైన్ పెయింటింగ్స్ చూసిన మతి పోవాల్సిందే అంటున్నారు.

ఇక వైన్ తో అద్భుతమైన బొమ్మలు వేసి అందరి నోటా వావ్ అని మెచ్చుకునేలా చేసింది సెర్బియన్‌కు చెందిన యువ కళాకారిణి.ఇక వైన్ తో బొమ్మలు కూడా వేయొచ్చు అని నిరూపించింది సంజా జాంకోవిక్ కళాకారిణి.

ఇక ఆమె వేసిన పెయింటింగ్స్ జీవం ఉట్టిపడేలా అందరిని ఎంతలా ఆకర్షిస్తున్నాయంటే.‘నీ చిత్రం చూసి.మా చిత్తం చెదిరి, మేం చిత్తరువైతిమయ్యో’ అని ఆమె అభిమానులు పాడుకోకుండా ఉండలేరేమో అనిపిస్తుంది.కాగా తను ఆయిల్ పెయింట్, వాటర్ కలర్స్ లేదా యాక్రిలిక్స్‌కు బదులుగా రెడ్, వైట్, రోస్ వివిధ రకాల వైన్‌లను ఉపయోగించి ఈ కళాకృతులను సృష్టిస్తుండటం విశేషం.

సంజా జాంకోవిక్‌కు పెయింటిగ్స్‌లో ప్రయోగాలు చేయడమంటే చాలా ఇష్టం.అందుకే అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించుకుని అద్భుతమైన కళాకృతులను తీర్చిదిద్దేది.ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో ‘వైన్’తో పెయింటింగ్ ట్రై చేసింది.ఆ ఆర్ట్ వర్క్ చూసి తనే ఆశ్చర్యపోగా.

వైన్‌తో పెయింటింగ్ వేయడం కొంత ప్రత్యేకతను అందిస్తుందని నమ్మింది.

Telugu Meida, Latets, Wine-Latest News - Telugu

అయితే ఈ అందమైన పెయింటింగ్స్ విభిన్నమైనవి, చమత్కారమైనవి.పెయింటింగ్స్‌లో ఉపయోగించిన వర్ణాల కారణంగా కాకుండా కిణ్వ ప్రక్రియ, ఆక్సీకరణ వల్ల ఈ కళాకృతులకు మరింత అందం చేకూరింది.ఈ రంగులు సహజంగా మనకు లభించవు.

మొదట్లో స్వదేశీతో పాటు ఇంపోర్టెడ్ వరకు, మెర్లోట్ నుంచి రోన్ రైస్‌లింగ్ వరకు అన్ని రకాల వైన్లను ఉపయోగించాను.అయితే ఎక్స్‌పీరియన్స్ వచ్చిన కొద్దీ వేర్వేరు వైన్స్ వల్ల వైట్ కాన్వాస్‌తో విభిన్నంగా ఇంటారాక్ట్ కావడాన్ని గమనించి పెయింటింగ్ నాణ్యతను స్థిరంగా ఉంచడానికి, కావలసిన టోన్లలో ఆ రంగులు స్థిరపడ్డానికి స్పెసిఫైడ్ వైన్స్‌ను వాడుతున్నాను.

వైన్ లాగా, ఈ పెయింటింగ్స్ సజీవంగా ఉన్నట్లు మెచ్యూర్ చెందుతాయి అని సంజా చెబుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube