Vegetables: వామ్మో ఈ కూరగాయ ధర కిలో రూ.85 వేలట... ఎక్కడంటే?

Wow, The Price Of This Vegetable Is Rs. 85 Thousand Per Kg Where Is It , Expensive Vegetable, Vegetables, Viral News, Latest News, Hop Shoots

రోజురోజుకీ పెరిగిపోతున్న నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.దాంతో సగటు సామాన్య మానవుడు బతకలేని దుస్థితి ఏర్పడింది.

 Wow, The Price Of This Vegetable Is Rs. 85 Thousand Per Kg Where Is It , Expensi-TeluguStop.com

ఓ వైపు పంటలు పండిస్తున్న రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలు లభించడంలేదు.అయితే ఇదంతా ఒకెత్తయితే… ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయలు ఉన్నాయని మీరు ఎపుడైనా విన్నారా? అవి వండుకు తినాలంటే మనం ఆస్తులు అమ్ముకోవాల్సిందే.బేసిగ్గా కిలోకు రూ.100-200 ధర ఉన్న కూరగాయలను మనం చాలా ఖరీదైనవిగా భావిస్తాము.అలాంటిది కిలో కూరగాయలు వేల రూపాయలకు అమ్ముడవుతాయని ఎప్పుడైనా అనుకున్నారా?.

ఒక కిలోగ్రాము కూరగాయల ధర ఓ తులం బంగారం కంటే ఖరీదైనదంటే మీరు నమ్ముతారా? అయితే ఈ కూరగాయలో ప్రత్యేకత గురించి తెలిస్తే మాత్రం మీరు అవాక్కవుతారు.అందుకే ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయలగా రికార్డ్ సాధిస్తున్నాయి.సగటున కిలోకు 80 వేల నుండి 85 వేల రూపాయల వరకు అమ్ముడవుతోంది.ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయల పేరు “హాప్ షూట్స్”.వీటిని వండుకు తినొచ్చు కాని అది కష్టం కాబట్టి వీటిని బీర్ తయారీలో ఎక్కువగా వినియోగిస్తారట.

Telugu Hop Shoots, Latest, Vegetables-Latest News - Telugu

అందుకే దీన్ని ఏ మార్కెట్‌లో లేదా స్టోర్‌లో చూడటం కష్టమనే చెప్పుకోవాలి.దీని పువ్వులను హాప్ కోన్స్ అని పిలుస్తారు, వీటిని బీరు తయారు చేయడానికి విరివిగా వినియోగిస్తారు.అలాగే దీని కొమ్మలను ఉల్లిపాయల వంటి సలాడ్లలో ఉంచుతారు.తేమ మరియు సూర్యకాంతి పొందడం ద్వారా దీని కొమ్మలు ఒక రోజులో 6 అంగుళాల వరకు పెరుగుతాయి.

వివిధ దేశాలలో దీని ధర భిన్నంగా ఉంటుంది.విదేశాలలో కిలోకు 1000 యూరోలు, మన కరెన్సీలో అయితే సుమారు 80 వేల రూపాయలు వరకు ఉంటుంది.

హాప్ రెమ్మలలోని ఔషధ గుణాలు శతాబ్దాల క్రితమే గుర్తించబడ్డాయి అని ప్రతీతి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube