వావ్... అచ్చు గుద్దినట్టు ఇందిరా గాంధీని దించేసిన మేకప్ మేన్

కొన్ని సినిమాలకు మేకప్ మేన్లు చేసే మేకప్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు.ముఖ్యంగా ఎవరైనా గుర్తింపు పొందిన వ్యక్తిలాగ మేకప్ చేయడం చాలా కష్టం .

 Wow The Make Up Man Who Brought Down Indira Gandhi Like A Mold-TeluguStop.com

వారి ముఖం అందరికి తెలిసి ఉంటుంది కాబట్టి మేకప్ చేసే వారు చాలా జాగ్రత్తగా వారికి మేకప్ చేయాల్సి ఉంటుంది.ఏ మాత్రం తేడా కొట్టిన మొదటికే మోసం వస్తుంది.

అలా ఉంటుంది మేకప్ మేన్ల పరిస్థితి.లీడర్లు, కానీ క్రికెటర్లు, కానీ ఎవరైనా సినీ తారల బయోపిక్ లు తీసేటపుడు చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.

 Wow The Make Up Man Who Brought Down Indira Gandhi Like A Mold-వావ్… అచ్చు గుద్దినట్టు ఇందిరా గాంధీని దించేసిన మేకప్ మేన్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ అనే మూవీలో నటిస్తున్నాడు.ఈ సినిమాకు రంజిత్‌ ఎం.తివారీ దర్శకత్వం వహిస్తున్నారు.కాగా ఈ మూవీని దాదాపు ఏడుగురు నిర్మాతలు కలిసి నిర్మిస్తుండడం విశేషం.1980 వ సంవత్సరంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ మూవీలో అక్షయ్ కుమార్ రా ఏజెంట్‌‌‌‌గా చేస్తున్నాడు.

ఈ మూవీలో అందాల ముద్దుగుమ్మలు వాణీ కపూర్, లారా దత్తా లాంటి వారు మెరుస్తారని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తియింది.ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డాక ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు సాగిస్తున్నారు.ఇకపోతే ఈ మూవీలో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ క్యారెక్టర్ కూడా ఉండడం విశేషం.

ఈ రోల్ లో అందాల ముద్దుగుమ్మ లారా దత్తా నటిస్తున్నారు.ఇటీవల ఆమె ఇందిరా గాంధీలా ఉన్న పోస్టర్ ను మూవీ టీం విడుదల చేయగా… తెగ వైరల్ గా మారింది.

పోస్టర్ మాత్రమే కాకుండా ఓ వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇలా ఆమె అచ్చు గుద్దినట్లు ఇందిరా గాంధీలా కనిపించేందుకు కష్టపడ్డ మేకప్ మేన్ ను అందరూ మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.

#Bell Bootom #Lara Datta

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు