వావ్: అతి తక్కువ ధరకే గాలి నుండి నీటిని ఉత్పత్తి చేసే మిషన్..!

ప్రకృతిలో దొరికే సహజ వనరుల్లో నీరు ఒకటి.అయితే నీరు జీవరాసులకు ఎంత అవసరమో అందరికీ తెలిసిందే.

 Wow: The Machine That Produces Water From The Air At The Lowest Cost ..! Air, Wa-TeluguStop.com

జంతువులు అయినా, పక్షులైనా, మానవుడైన నీటిని వినియోగించాల్సిందే.ప్రపంచంలో 70 శాతం నీరు ఆక్రమించి ఉన్నా తాగేందుకు కొంత శాతం మాత్రమే ఉపయోగపడుతున్నాయి.

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో నీటికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.ఇంటి అవసరాల కోసం నీరు తెచ్చుకునేందుకు సుదూర ప్రయాణాలు చేసే ప్రాంతాలు చాలానే ఉన్నాయి.

అయితే నీటి సమస్యలు తీర్చేందుకు చాలా సంస్థలు చాలా ప్రయత్నం చేస్తున్నాయి.గాలి నుండి నీటిని తయారు చేసేందుకు చాల యంత్రాలను తయారు చేస్తున్నాయి.

అలాంటి నీటి ఉత్పత్తి చేసే మిషన్ లు మార్కెట్లోకి వస్తున్నాయి.

గాలిలో ఉన్న తేమ నుండి నీటినితయారు చేయడానికి అమెరికా, స్పెయిన్ ఇజ్రాయిల్ వంటి దేశాలలో శాస్త్రవేత్తలు యంత్రాలను రూపొందించారు.

మనం చల్లటి జ్యూస్ తాగుతున్నప్పుడు ఆ గ్లాస్ పై నీటి బిందువులు మన చేతికి తగులుతూ ఉంటాయి.అలాగే గ్లాస్ లో నీరు బయటకు ఎలా వచ్చిందో ఆ నీటి బిందువులు ఎక్కడినుండి వస్తాయో అన్న ఆలోచనతోనే ఏసీలు ఫిల్టర్లు తయారు చేయబడ్డాయి.

ఈ యంత్రాలు ఏసి అంటే ఎయిర్ కండిషనర్ వంటి వైర్లను ఉపయోగించి గాలిని చల్లబరుస్తాయి.ఆ తర్వాత ఒక పాత్రలో నీటి బిందువులను సేకరించి గాలిలో ఉన్న తేమను నీటిగా మారుస్తారు.

Telugu Latest-Latest News - Telugu

ఈ పద్ధతిలో వీటిని తయారుచేసే యంత్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు వాషింగ్టన్ కేంద్రంగా పని చేస్తున్న సునామి ప్రొడక్ట్స్ సంస్థ.గాలి నుండి నీటిని తయారు చేసే యంత్రాలు గృహ కార్యాలయంతో సహా అనేక ప్రదేశాల్లో ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది.ముఖ్యంగా ఈ యంత్రాలు పొగమంచు ఉన్న ప్రాంతాల్లో బాగా పనిచేస్తాయి.వాటి పరిమాణాన్ని బట్టి ఒక రోజులో తొమ్మిది వందల నుండి 8,600 లీటర్ల నీటిని తయారు చేయగలవు.అయితే వీటి ధర ప్రస్తుతం రూ.30000 నుండి రూ.2 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి.

Telugu Latest-Latest News - Telugu

అయితే కాలిఫోర్నియాలోని చాలామంది ప్రజలు తమ ఇళ్లలో తాము నీటి సమస్యలను తీర్చుకోడానికి ఈ యంత్రాలను ఉపయోగిస్తున్నారు.ఈ సందర్భంగా వాషింగ్టన్ కేంద్రంగా ఉన్న ప్రాజెక్ట్ డిజైన్ ఇంజనీర్ డ్యూయిష్ మాట్లాడుతూ తాముయంత్రాల సహాయంతో గాలిలోని తేమ నుండి నీటిని తయారు చేస్తున్నామని, ఇటీవల గాలిలో ఉన్న తేమ నుండి నీటిని తీయడానికి అభివృద్ధి చేయబడిన వ్యవస్థలలో ఇది ఒకటి అని తెలిపారు.తన కంపెనీ యంత్రాలు గాలిలోని తేమ నుండి నీటిని వేరు చేస్తాయి అని, అలా బయటకు వచ్చిన నీళ్లు ఫిల్టర్ చేసి మనం తాగేలా చేస్తాము అని ఆయన తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube