వావ్: అతి తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లతో సోలార్ సైకిల్..!

అసలే కరోనా కాలం అనిచెప్పి ఎవ్వరూ బయటకు రావడం లేదు.ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుతుండటం వలన ఇళ్లల్లోంచి బయటకు కదులుతున్నారు.ఇప్పుడు ఈ పెట్రోల్ బాదుడు ఒకటి.ధరలు పెరిగిపోవడం వలన వాహనదారులు జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు.ఇటువంటి సమయంలోనే తమిళనాడులోని శివగంగై జిల్లాకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు సోలార్ సైకిల్ ను తయారు చేశారు.ఈ సైకిళ్లకు పెట్రోల్ అనేది అవసరం ఉండదు.

 Solar Bicycle With Affordable Features  Solar Cycle, New Features, Students, Ta-TeluguStop.com

సోలార్ బ్యాటరీ ఛార్జింగ్‌తో ఈ సైకిల్ నడుస్తుంది.ఇటువంటి సైకిల్ గంటకు 25 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది.ఇటువంటి సోలార్ ఎలక్ట్రిక్ సైకిల్ అనేది సూర్యకాంతిలో 30 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.5 గంటల వరకూ దీనిని ఛార్జింగ్‌ పెడితే ఈ సైకిల్ పైన హాయిగా కూర్చొని వెళ్లవచ్చు.అంతేకాకుండా సూర్యకాంతి ఉన్నా లేకపోయినా కూడా ఈ సైకిల్ ని తొక్కుతూ ఉంటే ఎంతో హాయిగా ప్రయాణం చేసే అవకాశం ఉంది.అయితే ఈ సైకిల్ 150 కిలోల వరకు బరువును మోస్తుంది.

మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలుగా ఈ సైకిల్ లో ఛార్జింగ్ స్లాట్లు అనేది అమర్చారు.

శివగంగై కాలేజీ రోడ్ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న వీరపతిరన్, అమాని దంపతులకు వీరగురుహరికృష్ణన్, సంపత్కృష్ణన్ అనే కొడుకులు ఉన్నారు.

వీరగురుహరికృష్ణన్ తిరుపువనంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో 8వ తరగతి, సంపత్కృష్ణన్ శివగంగై స్కూల్ లో ఏడవ తరగతి అభ్యసిస్తున్నారు.అయితే లాక్‌డౌన్ వలన పాఠశాలలు మూసేశారు.

దీంతో వీరిద్దరూ సైకిళ్లపై తిరుగుతూ కాలం గడిపారు.ఆ టైంలోనే పెట్రోల్ ధరల పెరుగుదల విషయం తెలియడంతో వారికి పెట్రోల్ లేకుండా నడిచే వాహనాలను రెడీ చేయాలని అనిపించింది.

దీంతో వారు సోలార్ సైకిల్ ను తయారు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Telugu Thousands, Solar Cycle, Tamilnadu-Latest News - Telugu

ఆ తర్వాత ఆన్‌లైన్, స్థానిక దుకాణాల‌లో సోలార్ సైకిల్ తయారు చేసేందుకు అవసరమయ్యే బ్యాటరీ, మోటారు, సోలార్‌ ప్లేట్లును కొనుక్కున్నారు.ఆ పార్ట్స్ తో సోలార్ సైకిల్ ని తయారు చేశారు.ప్రస్తుతం వీరుచేసిన సోలార్ సైకిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube