ఈ రోబోలు ఎలా ఫీట్లు చేస్తున్నాయో చూస్తే వావ్ అంటారంతే..

రోబోలు అంటే టెక్నాల‌జీకి నిలువెత్తు నిద‌ర్శ‌నంలా నిలుస్తున్నాయి.సేమ్ టు సేమ్ మ‌నుషుల్లాగే అవి చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే మ‌నసుకు ముచ్చ‌టేస్తుంది.

 Wow If You See How These Robots Are Doing Feats , Robots, Viral Video , Singapor-TeluguStop.com

అస‌లు మ‌నుషుల అవ‌స‌ర‌మే లేదేమో అనిపిస్తోంది.ఇక కొన్ని రెస్టారెంట్ల‌లో వీటిని అట్రాక్ష‌న్ కోసం పెడుతూ వాటితో స‌ర్వ్ చేయిస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే ఈ కరోనా వ‌చ్చిన త‌ర్వాత రోబోల వాడకం మరింతగా పెరిగిపోయింద‌నే చెప్పాలి. కొవిడ్ ఆస్పత్రుల ద‌గ్గ‌రి నుంచి రెగ్యుల‌ర్‌గా తిన‌డానికి వెళ్లే ఫేమ‌స్ రెస్టారెంట్ల దాకా ఈ రోబోల‌దే ప‌నితనం న‌డుస్తోంది.

ఇక ఇప్పుడు కూడా వీటి గురించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.అదేంటంటే బోస్టన్‌ డైనమిక్స్ అనే కంపెనీ డెవ‌ల‌ప్ చేసిన రోబో చేస్తున్న విన్యాసాలు మామూలుగా లేవు.

అది అచ్చం మనిషి లాగే ప‌నులు చేస్తూ ఉంటుంది.ఇంకా చెప్పాంల‌టే ఒక ద‌గ్గ‌రి నుంచి మరో ద‌గ్గ‌ర‌కు అమాంతం గాలిలో ఎగురుతూ అలాగే గోడలను సైతం దూకేస్తూ ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాయి.

ఇక వాటి విన్యాసాలు చూసిన త‌ర్వాత వావ్ అన‌క ఉండ‌లేరేమో అనిపిస్తోంది.అయితే నిజానికి అమెరికాకు చెందిన ఈ బోస్టన్ కంపెనీ ఇంత‌కు ముందు కూడా ఇలాగే రోబోల‌ను తయారు చేసింది.

ఇక ఈ కంపెనీ త‌యారు చేసిన రోబోలు ఇప్పటికే సింగపూర్‌ పార్క్‌లు అలాగే డెవ‌ల‌ప్ అయిన దేశాల్లోని విధుల్లో కరోనా క‌ష్ట‌కాలంలో భౌతిక దూరం పాటించాలంటూ చాలా బాగా అవ‌గాహ‌న సైతం క‌ల్పించేశాయి.ఇక ఇప్ప‌డు ఓ అడుగు ముందుకేసి మ‌రీ సేమ్ మ‌నుషుల్లాగే ఫీట్లు చేస్తున్న రెండు రోబోల‌ను కూడా సృష్టించింది.

ఇక అవి కూడా స‌క్సెస్ కావ‌డం గాల్లో స్టంట్లు చేసే స్థాయిలో ఫీట్లు చేయ‌డంతో ఇప్పుడు బాగా ఫేమ‌స్ అయిపోయాయి.ఇక వీటిన త‌యారు చేసిన బోస్ట‌న్ సంస్థ ఈ రోబోల‌కు సంబంధించిన వీడియోల‌ను నెట్టింట షేర్ చేయ‌గా విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube