వావ్‌.. స్టేడియంపై నుంచి కింద ప‌డుతున్న పిల్లిని ప్రేక్ష‌కులు ఎలా కాపాడారంటే..?

ఈ మ‌ధ్య జంతువుల‌కు సంబంధించిన వీడియోలు అయితే తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.ఇక స్టేడియంలో మ్యాచు మ‌ధ్య‌లో కొన్ని జంతువులు రావ‌డం కూడా ఈ మ‌ధ్య త‌ర‌చూ చూస్తూనే ఉన్నాం.

 Wow How Did The Spectators Save The Cat Falling From The Top Of The Stadium-TeluguStop.com

ఇక ఇందులో ప్ర‌ధానంగా కుక్క‌లు రావ‌డం ఇబ్బంది పెట్ట‌డం లేదంటే బాల్‌ను ఎత్తుకుని వెల్ల‌డం లాంటివి చూస్తూనే ఉన్నాం.ఇక ఇటీవ‌ల అయితే మయామిలోని హార్డ్ రాక్ స్టేడియంలో జ‌రిగిన ఘ‌ట‌న తెగ హ‌ల్ చ‌ల్ అయింది.

ఇందులో ఓ ఫుట్‌బాల్ లైవ్ మ్యాచులోకి స‌డెన్ గా పిల్లి వ‌చ్చి ఎంత ర‌చ్చ చేసిందో ఇప్పుడు మ‌నం నెట్టింట్లో తెలుసుకుందాం.

 Wow How Did The Spectators Save The Cat Falling From The Top Of The Stadium-వావ్‌.. స్టేడియంపై నుంచి కింద ప‌డుతున్న పిల్లిని ప్రేక్ష‌కులు ఎలా కాపాడారంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇందులో ఆ పిల్లి కాస్తా స్టేడియం పై నుంచి కింద ప‌డ‌బోతుంది.

కాగా దీన్ని పైన ఉన్న డెక్‌లోని ప్రేక్షకులు వేలాడుతున్న పిల్లిని చూసి వెంట‌నే అల‌ర్ట్ అవుతారు.ఇక ఎలాగైనా ఆ పిల్లిని ప‌డిపోకుండా సురక్షితంగా పట్టుకోవడానికి వారంతా కూడా ప్రయత్నించారు.

అయితే పైన ఉన్న వారి వ‌ల్ల కాలేదు.దీంతో కొద్ది సేపు వేలాడిన త‌ర్వాత ఆ పిల్లి కాస్త గబాలున కిందపడిపోయింది.

అయితే అప్ప‌టికే పిల్లిని స్టేడియంలోని ప్రేక్షకులు కాపాడేందుకు అమెరికా జెండాతో రౌండ‌ప్‌గా నిల‌వ‌డి దాన్ని అందులో ప‌డిపోయేలా చూశారు.

ఇంకేముంది పిల్లి కాస్తా ఆ జెండాలో ప‌డ‌టంతో బ‌తికిపోయింది.

ఇక దీన్ని చూసిన ప‌క్క‌నున్న వారంతా కూడా చప్పట్లు కొడుతూ పిల్లికి కంగ్రాట్స్ చెబుతున్న‌ట్టు ఉంది.ఇక స్టేడియంలో ఉండే సెక్యూరిటీ సిబ్బంది వ‌చ్చి వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతారు.

అంతే కాకుండా ఆ పిల్లిని తీసుకుని సురక్షితంగా తీసుకెళ్తారు.ఇక ఆ పిల్లిని స్టేడియం బ‌య‌ట‌ వదిలేశారు వారు.

అయితే ఈ ఘ‌ట‌న‌లో పిల్లికి ఎలాంటి గాయాలు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.ఇక పిల్లిని కాపాడిన వారంద‌రిపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

మ‌రి మీరు కూడా చూసేయండి.

#Wow.. #Stadium

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు