వావ్.. ఈ అరుదైన పెంగ్విన్ ఎంత క్యూట్ గా ఉందో కదా..!

సాధారణంగా పెంగ్విన్లు నలుపు, తెలుపు రంగులో ఉంటాయి.బుడి బుడి నడకలతో అడుగులు వేస్తూ గడ్డకట్టించే మంచు నీటిలో కూడా శరవేగంగా ఈదగల ఈ పెంగ్విన్లు తమ చిత్రమైన ప్రవర్తనతో చూపరులను బాగా ఆకట్టుకుంటాయి.

 Wow How Cute Is This Rare Yellowish Penguin, Yellow Penguin, Viral Latest, Viral-TeluguStop.com

అయితే తాజాగా ఒక పసుపు పచ్చ రంగులో ఉన్న పెంగ్విన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.దీంతో నెటిజనులు ఈ పెంగ్విన్ ఫోటోని చూసి ఆశ్చర్యపోతున్నారు.ఎవ్స్ ఆడమ్ అనే ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మాట్లాడుతూ.2019 వ సంవత్సరం లో దక్షిణ జార్జియా దీపం పై పర్యటిస్తున్న సమయంలో తాను ఒక పసుపు పచ్చ పెంగ్విన్ ని చూశాను అని.ఆ వెంటనే దాని ఫోటో తీశాను అని చెప్పారు.

ప్రస్తుతం ఆయన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన పసుపు పచ్చ పెంగ్విన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

నీటి ఏనుగులు, సీల్స్ వంటి ఎన్నో మాంసాహార జీవులను దాటుకొని ఓ పసుపుపచ్చ పెంగ్విన్ తమవైపు బుడిబుడి నడకల వేస్తూ వచ్చిందని.దీంతో ఆ అరుదైన సంఘటనను తమ అదృష్టంగా భావించి ఫోటోలు తీసుకున్నామని ఆయన అన్నారు.

ఈ బీచ్ లో వందల సముద్ర జంతువులు ఉంటాయని వాటన్నిటిని ఫోటోలు తీయడం చాలా కష్టమని ఆయన అన్నారు.

Telugu Rare Penguin, Soical, Georgina Island, Latest, Wild, Yellow Penguin-Lates

అయితే అక్కడ ఉన్న 1.2 లక్షల పెంగ్విన్లు అన్నీ కూడా నలుపు, తెలుపు రంగులో ఉన్నాయి కానీ ఒకే ఒక్క పెంగ్విన్ మాత్రమే పసుపు పచ్చ రంగులో ఉందని ఆయన వెల్లడించారు.మొట్టమొదటిగా పసుపుపచ్చ పెంగ్విన్ ని చూసిన వ్యక్తి తానే అయి ఉండొచ్చని ఆయన అన్నారు.

బహుశా ఈ పెంగ్విన్ లూసీజం అనే వ్యాధితో బాధపడుతూ ఉండొచ్చని.అందుకే తనను ఒరిజినల్ కోల్పోయి ఇలా పసుపు పచ్చ రంగులో జన్మించి ఉండొచ్చని ఆయన అంటున్నారు.

ఇక్కడ చాలా పెంగ్విన్లు పసుపుపచ్చ రంగు కళ్ళతో ఉన్నాయని.అవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube