వావ్.. వారికి ఫ్రీ యోగా, కంప్యూటర్ ట్రైనింగ్.. ఎక్కడంటే..!?

ఒకవైపు దేశం టెక్నాలజీ పరంగా, వాణిజ్య పరంగా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్న కానీ, మరోవైపు అక్కడక్కడ మనకు యాచకులు కనిపిస్తూనే ఉన్నారు.ఒక్క పూట కూడా సరిగ్గా ఆహారం తీసుకోలేని యాచకులు ఎంతోమంది ఉన్నారు.

 Wow Free-yoga-for-them-computer-training-where Beggers, Free Training, Computer-TeluguStop.com

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇంకా చేతులు చాపుతూ డబ్బులను సేకరించి వారి కడుపులు నింపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.అయితే ఇదిలా ఉండగా యాచకులకు రాజస్థాన్ ప్రభుత్వం ఒక మంచి ఆఫర్ ప్రకటించింది.

రాష్ట్ర రాజధాని అయిన జైపూర్ లో బెగ్గర్‌ ఫ్రీ అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టి వారికి అండగా నిలుస్తున్నారు.ఈ బెగ్గర్ ఫ్రీ కార్యక్రమాన్ని రాజస్థాన్ స్కిల్‌ అండ్‌ లైవ్లీహుడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (RSLDC), సోపన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ వారు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ఈ కార్యక్రమంలో భాగంగా మొదట 43 మంది బిచ్చగాళ్లను హోమ్ షెల్టర్లు కి తరలించారు.వీరందరూ కూడా దాదాపు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల నుంచి వలస వచ్చి జైపూర్లో రోడ్డుపై జీవనం కొనసాగిస్తూ ఉన్నారు.

అందరికీ ఈ కార్యక్రమంలో భాగంగా ఉచిత వసతి సదుపాయం కల్పించడంతోపాటు భోజనం, యోగ, కంప్యూటర్ శిక్షణ అందజేస్తున్నారు.అలాగే బ్యాచ్ లుగా డివైడ్ చేసి వారికి శిక్షణ ఇచ్చిన అనంతరం ఉద్యోగాలు కూడా కనిపిస్తున్నట్లు RSLDC సంస్థ చైర్మన్ నీరజ్ కుమార్ తెలియజేశారు.

Telugu Beggers, Yoga-Latest News - Telugu

ఈ సందర్భంగా చైర్మన్ నీరజ్ కుమార్ మాట్లాడుతూ బిచ్చగాళ్లను బాధ్యత గల పౌరులుగా మార్చడమే మా ముఖ్య లక్ష్యం అని.రాజస్థాన్ పోలీసులు జైపూర్లో సర్వే నిర్వహించిన ఆధారంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని ప్రస్తుతం 20 మందికి శిక్షణ అందజేస్తున్నామని వారి శిక్షణ పూర్తయిన అనంతరం ఉద్యోగాలు కూడా కల్పిస్తామని తెలియజేశారు.

ఇక యోగా ట్రైనర్ మాట్లాడుతూ మానసికంగానే కాకుండా పలు అనారోగ్య సమస్యలతో బలహీనంగా వారు ఉంటారని పేర్కొన్నారు.వారి పరిస్థితులకు  అనుగుణంగా మేము శిక్షణ ఇస్తున్నామని, అలాగే శిక్షణతో పాటు వారికీ రోజుకి 215 రూపాయలు చెల్లిస్తుందని తెలిపారు.

ఇది ఇలా ఉండగా రాజస్థాన్ రాష్ట్రంలో చేపట్టిన ఈ కార్యక్రమం పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఈ కార్యక్రమం చాలా మంచిదని దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube