వావ్‌..చికెన్ వ్య‌ర్థాల‌తో డీజిల్ త‌యారీ.. రేట్ వెరీ చీప్‌!

ప్రపంచాన్ని ఇప్పుడు పెట్రోల్ ఏ స్థాయిలో శాసిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.స‌గ‌ట మ‌న‌షి జీవితాన్ని ప్ర‌భావితం చేసే స్థాయిలో ఇప్పుడు పెట్రోల్ ఉంద‌నే చెప్పాలి.

 Wow Diesel Made With Chicken Waste Rate Very Cheap-TeluguStop.com

అంత ప్రాముఖ్య‌త ఉన్న పెట్రోల్ ను కొనాలంటేనే మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు విల‌విల‌లాడిపోతున్నారు.అయితే ఇప్పుడు ఇలా ఇబ్బంది ప‌డుతున్న వారంద‌రికీ ఓ గుడ్ న్యూస్ వ‌చ్చేసింది.

అదేంటో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు.ఇప్పుడు తీవ్రంగా ఇంధన కొరత పీడిస్తున్న స‌మ‌యంలో మ‌న భారతదేశం కొత్త ప్ర‌యోగం చేసింది.

 Wow Diesel Made With Chicken Waste Rate Very Cheap-వావ్‌..చికెన్ వ్య‌ర్థాల‌తో డీజిల్ త‌యారీ.. రేట్ వెరీ చీప్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏకంగా చికెన్ వ్యర్థాలతో ఎన్నో ప్ర‌యోగాలు చేసి చివ‌ర‌కు బయో డీజిల్‌ను ఉత్పత్తి చేసి ప్ర‌పంచంలోనే పెద్ద సంచలనం సృష్టించింది మ‌న ఇండియా.

అయితే ఈ బ‌యో డీజిల్ వాడితే కాలుష్య ప్రభావం పెద్ద‌గా ఉంద‌డ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే ఇది మామూలు డీజిల్ లాగే ప‌నిచేస్తుంద‌ని స‌మాచారం.నిజానికి కోళ్ల ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది మ‌న భార‌త్‌.

అలాగే కోళ్ల మాంసం వినియోగంలో కూడా ప్ర‌పంచంలోనే రెండో ప్లేస్ లో ఉంది మ‌న ఇండియా.ఈ కార‌ణంగానే ఇలాంటి ప్ర‌యోగాల‌కు తెర‌లేపారు మ‌న సైంటిస్టులు.కేరళ రాష్ట్రానికి చెందిన పశు వైద్యుడు జాన్‌ అబ్రహం ఈ స‌రికొత్త బ‌యో డీజిల్‌ను ఆవిష్కరించారు.

Telugu Bio Diesel, Chicken Wastage, Diesel, India, John Abraham, Kerala Scientist, New Invention, No Pollution, Technology, Very Cheap Diese-Latest News - Telugu

ఆయ‌న ఎంతో శ్ర‌మించి చాలా ర‌కాల ప్ర‌యోగాల త‌ర్వాత చికెన్‌ వ్యర్థాల నుంచి బయో డీజిల్‌ తయారు చేసి అబ్బుర‌ప‌రిచారు.అయితే రీసెంట్ గా ఈయన త‌యారు చేసిన ఈ బ‌యో డీజిల్‌కు కేంద్ర ప్రభుత్వం పేటెంట్లు కూడా జ‌రీ చేయ‌డంతో ఆయ‌న ఆనందానికి అవ‌ధుల్లేవు.ప్ర‌స్తుతం జాన్‌ అబ్రహం వయనాడ్‌ జిల్లాలోని పుకొడ్‌ వెటర్నరీ కాలేజీలో సీనియ‌ర్ ప్రొఫెసర్‌గా ప‌నిచేస్తూనే ఇలాంటి ప్ర‌యోగాలు చేస్తున్నారు.2014లోనే ఈ బ‌యో డీజిల్‌ను త‌యారు చేసినా ఆయ‌న పేటెంట్ల కోసం అప్పుడు అప్లై చేయ‌గా ఇప్పుడు ఆమోదం లభించింది.లీటరుకు రూ.59 వ‌ర‌కు అమ్మొచ్చ‌ని ఆయ‌న చెబుతున్నారు.

#Diesel #India #John Abraham #Bio Diesel #Cheap Diese

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు